By Village Missionary Movement
Tuesday, 18-Apr-2023దిన ధ్యానము(Telugu) 18.04.2023
అంశం: సత్క్రియలు
"సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును" - రోమీయులకు 2:7
ఒక దర్జీ తన దుకాణంలో బట్టలు కుడుతూ ఉన్నాడు. తన కుమారుడు పక్కనే నిలబడి అతను చేస్తున్న పనిని చూస్తూ ఉన్నాడు. దర్జీ ఒక నూతన దుస్తులను తీశాడు దానిని అందమైన మెరిసే కత్తిరితో ముక్కలుగా కత్తిరించాడు. తర్వాత ఆ కత్తెరను కాళ్ల దగ్గర పడేసి ఆ దుస్తులను కుట్టడం ప్రారంభించాడు. ఆ దుస్తులను పూర్తిగా కుట్టిన తర్వాత సూదిని తీసి తన తలపై ఉన్నటువంటి టోపీలో గుచ్చి భద్రపరిచాడు.
దీనినంతటిని చూస్తున్న తన కుమారుడు తన తండ్రితో నాన్న కత్తెర ఖరీదైనది అందమైనది దానిని నిర్లక్ష్యంగా కాళ్ల దగ్గర పడేశారు. సూది చాలా చిన్నది తక్కువ రేటుకు దొరికేది కానీ దానిని చాలా భద్రంగా ఉంచారు ఎందుకని అని అడిగాడు. ఆశతో అడిగిన తన కుమారునికి దీని నుండి ఒక మంచి విషయాన్ని నేర్పించాలి అనుకున్నాడు తండ్రి. సూదిని ఎక్కడెక్కడో పెడితే దానిని వెతకడం చాలా కష్టము అది పోతుంది అనేది చిన్న కారణం అయినప్పటికీ అతను చెప్పిన సమాధానము ఆ చిన్న వాని హృదయాన్ని తాకింది.
కుమారుడా కత్తెర అందముగా ఖరీదైనదిగా ఉన్నప్పటికీ దీని పని కత్తిరించడం అనగా విడదీయడము కానీ సూది చిన్నదిగా ఉన్న దాని పని జోడించడము. ఒకరి యొక్క విలువ వాని క్రియల ద్వారా నిర్ణయించబడుతుంది రూపమును బట్టి కాదు అని అన్నాడు.
అవును ప్రియమైన వారలారా! మనము ఎటువంటి ఫలమును కలిగి ఉన్నాము? మంచి చెట్టుకు మంచి ఫలము ఫలించును అని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనము కూడా ఆత్మఫలములైన 9ఫలములను కలిగి ఉందాం.
పరిశుద్ధ గ్రంథంలో పౌలును మనము చూసినప్పుడు కఠినమైన సౌలుగా ఉన్న అతను పౌలుగా మారిన తర్వాత గొప్ప ఫలములను ఇచ్చాడు. తన్ను తాను క్రీస్తు కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. తన యొక్క క్రియలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విడిపోయిన వారిని ఒకటిగా చేర్చడం, ఖైదీగా ఉన్నప్పుడు కూడా సువార్తను ప్రకటించడం, సంఘాలకు మంచి సలహాలు చెప్పడం ఇలా అతని ఫలాలను పెంచుకుంటూ వెళ్ళాడు.
మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? ఇతరులకు మేలు చేస్తున్నామా లేదా కీడుకు బదులుగా ప్రతికీడు చేస్తున్నామా కొంచెం ఆలోచించి చూద్దాం. క్రీస్తు వలే పౌలు వలె శ్రమల మధ్యలో కూడా ఇతరులకు మంచి ఫలములను ఇద్దాం క్రీస్తు ప్రేమను అంతటా చాటుదాం. ఆమెన్!
- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు
ప్రార్థన అంశం:
తమిళనాడులో గల తిరుచిలో జరుగుతున్న రివైవల్ యూత్ మీటింగ్ కు అన్ని సంఘాల నుండి సహాయం వచ్చేలా, అక్కడ ఉన్న యవ్వనస్తులను పంపించేలా ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250