By Village Missionary Movement
Monday, 17-Apr-2023దిన ధ్యానము(Telugu) 17.04.2023
అంశం: తృప్తినిచ్చేది ఏది
"నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు" - యోహాను 4:14
సమాచార సాంకేతిక విభాగంలో పనిచేసి చేతినిండా జీతము తీసుకుంటున్న జయకర్ కొన్ని సమయాల్లో ఆఫీసులో నిశ్శబ్దముగా ఏదో బాధలో ఉన్నట్లు ఉంటాడు. అతడు సంతోషాన్ని కోల్పోయి ఆందోళన కలిగిన ఒక ఓటమితో కనిపించినప్పుడు అతని సన్నిహితులు అందుకు గల కారణమును అర్థం చేసుకుంటారు. ముందు రోజు తన తప్పుడు సంతోషాలను వెతుక్కుంటూ వెళ్ళాడు అని.
సొలోమోను రాజు అనుభవించు రాజా అనుభవించు అనే విధముగా జీవిత సుఖములను అనుభవించడానికి అంకితమయ్యాడు. కానీ సొలోమోను మనకు నేర్పించిన విషయం ఏమిటి? దేనిలో కూడా నిజమైన సంతృప్తి లేదని తెలియజేశాడు. చివరికి అంతయు వ్యర్థమే అని అన్నాడు.
ఈ లోకంలో కొంచెం సమయం మనసును సంతోషపరచడానికి ఎన్నో కార్యాలు కలవు. వీటి ద్వారా ఒక వ్యక్తి తన మనసును ఎన్నో విధాలుగా సంతోషపరచుకొనగలడు. వీటిని అనుభవిస్తూ ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? అసంతృప్తి, శూన్యత ఇంకా అధికమైన ఆశ పెరుగుతాయి. ఎంత అత్యధికంగా మీరు ఈ లోక కార్యాలను వెతుక్కుంటూ వెళ్తున్నారో అంతగా అది ఇంకా కావాలి ఇంకా కావాలి అనే దాహమును కలిగిస్తాయి. కాబట్టి లోకపు సంతోషాలను కోరి ఎప్పుడు మీరు తృప్తి పొందలేరు ధనం, డబ్బు, ఆస్తి, భౌతిక వస్తువులు మానసిక ఆనందాలు ఏవైనప్పటికీ వాటి నుండి తృప్తి పొందలేము అన్నది నిజము.
అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పికొనడు అని చెబుతున్నారు. కానీ దేవుడు మనకు ఇచ్చిన సంతోషము, సమాధానము, మనశాంతి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. మనము జీవిస్తున్న విధానము మనలను సంతోషపరుస్తుందా లేక దుఃఖపరుస్తుందా అనే విషయాన్ని మనం చూడాలి. ఆ యవ్వనస్తులైన జయకర్ సంతోషించిన మార్గాలు మరలా అతని మనసులోనికి వచ్చినప్పుడు అవి తనను కృంగదీస్తున్నాయి. ఒకరి యొక్క సంతోషమునకు శత్రువు బయట కాదు అతనిలోనే ఉంటాడు.
- ఎస్. బెర్లిన్ సెల్వరాజ్ గారు
ప్రార్థన అంశం:
స్వస్థతనిచ్చు ఆరాధనలో శరీర బలహీనతలతో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పరిపూర్ణ స్వస్థత పొందుకొను లాగున ప్రార్థిద్దాం .
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250