Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.04.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 16-Apr-2023

దిన ధ్యానము(Telugu) 16.04.2023 (Kids Special)

 

అంశం: మ్యాజిక్ పనిచేయదు

 

“వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు” - కీర్తనలు 119: 72

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు. 

కొక్కో చికుబుకు చికుబుకు అనే శబ్దం వినగానే హాయ్ ట్రైన్ వెళుతుంది అని చెప్పి టాటా చెబుతూ ఉంటాం. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలు. మీలో ఎవరెవరు ట్రైన్ ఎక్కారు చాలా జాలిగా ఉంటుంది కదా? అయితే ట్రైన్ లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఈరోజు మీతో చెప్పబోతున్నాను. మరి శ్రద్ధతో విందామా? ఆర్ యు రెడీ! 

 

ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, టూర్లకు వెళ్లేవారు, 

కాలేజీకి వెళ్లేవారు ఇలా చాలామంది ట్రైన్లో ప్రయాణం చేస్తారు కదా. ఒకసారి అందులో యేసయ్య కొరకు సేవ చేస్తున్న ఒక అంకుల్ ప్రయాణిస్తూ ఉన్నారు. మ్యాజిక్ చేసే మరొక అంకుల్ కూడా అదే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. మ్యాజిక్ అనగానే వెంటనే సండే స్కూల్ వి.బి.ఎస్ లో మిమ్మల్ని సంతోష పెట్టడానికి చేసిన మ్యాజిక్ అనుకోకండి. ఇది ఒక మాయా మంత్రాలు వినియోగించి చేసేది. అతడు మంత్రాలు చేసి తనకు తెలిసిన మాయలను చేసి డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. అందరూ నన్ను చూడండి డబ్బా ఖాళీగా ఉంది అని చెప్పి టప్ టప్ అని కింద మీద కొట్టారు ఆ తర్వాత ఆ డబ్బా తెరిచి చూస్తే ఆ డబ్బా నిండా డబ్బులు కిందపడ్డాయి అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఇలా చాలా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న అంకుల్ ఉన్న చోటికి వచ్చి అదే మ్యాజిక్ ను చేయాలి అని ప్రయత్నించాడు కానీ చేయలేకపోయాడు. డబ్బాను తెరిచిన గాని అందులో డబ్బులు లేవు చుట్టూ తిరిగి చూశాడు. సేవ చేస్తున్న అంకుల్ బైబిల్ చదువుతూ ఉన్నారు. ఈ బైబిలే కారణం అనుకొని దానిని తీసుకొని కొంచెం దూరంగా పెట్టేశాడు. 

 

సరే ఇప్పుడు మన పనిని మొదలుపెడదాం అందరూ నన్ను చూడండి ఖాళీగా ఉన్న డబ్బాలో నుండి డబ్బులు రాబోతున్నాయి అని చెప్పడంతో అందరూ ఆసక్తితో ఆదరణ చూస్తూ ఉన్నారు. కానీ ఏమీ జరగలేదు అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ సేవకుడైన అంకుల్ మీరు బైబిల్ తీసుకుని దూరంగా పెట్టిన వాక్యము నా హృదయములో ఉన్నది నాలో యేసయ్య ఉండడం వలన ఆయన యొక్క మహిమ కూడా ఇక్కడే ఉన్నది అని చెప్పారు. వెంటనే యేసయ్య మహిమ ఎదుట మ్యాజిక్ పనిచేయలేదు అని ఎరిగి యేసయ్య నిజమైన దేవుడు అని అక్కడ ఉన్న అందరూ యేసయ్య నందు విశ్వాసం ఉంచారు. ఆ సేవకుడు ఎవరో తెలుసా? ఆ సేవకుడే సాధు సుందర్ సింగ్. ఆయనలో ఉన్న ఈ వాక్యం ఎంతటి మార్పులు తీసుకుని వచ్చిందో చూసారా? 

 

ప్రియమైన పిల్లలు! మీకు నేర్పిస్తున్న వాక్యాలను మరిచిపోకూడదు. అది మాత్రమే కాదు ప్రతిరోజు ఒక వాక్యమైనా కంటత చేసి నేర్చుకోవాలి. జీవము కలిగిన వాక్యము నీకు, నీ ద్వారా ఇతరులకును దేవుని యొక్క మహిమను తెలుసుకొనటకు సహాయము చేస్తుంది. ఏంటి పిల్లలు మరి బైబిల్ ఎంత గొప్పదో తెలుసుకున్నారా? ఈరోజే బైబిల్ చదవడం ప్రారంభించండి సరేనా! 

- సహోదరి. దేబోరాల్ గారు 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet