Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.04.2023
Share:

By Village Missionary Movement

Friday, 14-Apr-2023

దిన ధ్యానము(Telugu) 14.04.2023

 

అంశం: అమెజాన్ నది

 

"ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?" – హెబ్రీయులకు 2:3

 

అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలో గల అతి పొడవైన నది దీని పొడవు దాదాపుగా 6400 కిలోమీటర్లు. ఆ నదీ పరివాహక ప్రాంతము స్విట్జర్లాండ్ దేశానికి సమానమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ నది దక్షిణ అమెరికా ఖండంలోని ఉత్తర భాగంలో ఉద్భవించి కొలంబియా దేశాన్ని దాటి బ్రెజిల్ దేశం గుండా ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇందులో 3000 రకాలు చేపలు ఉంటాయి. ఈ నదికి ఇరువైపులా అమెజాన్ దట్టమైన అడవులు ఉన్నాయి. ఇందులో 25 లక్షల వివిధ రకములైన కీటకాలు, రెండు వేల రకాల పక్షులు, వేలకు పైగా వృక్షజాలు ఉంటాయి. బ్రాంక అని పిలవబడే నరమాంసభక్షక చేపలు, సుమారుగా 45 అడుగుల వరకు పెరిగే అనకొండ పాములు, ప్రాణాంతకమైన విషపూరితమైన కప్పలు ఉన్నాయి అని గుర్తించడం జరిగింది. 

 

ఒకసారి అట్లాంటిక్ మహాసముద్రము గుండా ఈ నదిలోనికి ప్రవేశించిన ఓడ యాంత్రిక లోపం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. చాలా రోజులు గడిచినా ఆ ఓడను సరి చేయని స్థితిలో అందులో ఉన్న నావికులు, ప్రయాణికులు కూడా ఓడను విడిచి బయటికి రాలేని పరిస్థితిలో చాలా బాధను అనుభవించారు. చేతిలో ఉన్న ఆహారము త్రాగే నీరు తక్కువైపోయాయి. తరువాత అందరూ ఆకలితో, దాహంతో అల్లాడిపోయారు. త్రాగే నీరు కూడా లేని పరిస్థితిలో చనిపోవడానికి కూడా వెళ్లే పరిస్థితికి వచ్చేసారు. వారికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అనేక దినములు గడిచిన తర్వాత ఆ మార్గంలో వెళ్లిన పెరునాటుకు చెందిన పడవలో కొంతమంది ఆ ఓడలో ఉన్న వారి పరిస్థితిని ఎరిగి వారిని చూచి అయ్యా ఇలా బుద్ధిలేని వారి వలె చనిపోవలసిన అవసరం ఏమటి? మీ ఓడ ఉన్న ఈ నదిలో మంచినీరు ప్రవహిస్తుంది తీసుకొని తాగండి అని బిగ్గరగా చెప్పారు. ఓడలో ఉన్న వారు అందరూ వారి మాటలు విని వెంటనే నీటిని తీసి తాగారు. 

 

ప్రియమైన వారలారా! మన ప్రభువైన యేసుక్రీస్తు తన నిష్కలంకమైన రక్తమును చిందించి ఉచితముగా మనకు ఇచ్చిన రక్షణను గ్రహించకుండా ఈనాడు అనేకులు సమాధి చేయబడుతున్నారు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని 2 కోరింది 6:2లో వ్రాయబడి ఉన్నది. పేరునాటు ప్రజల వలె నాశనంలో ఉన్నవారికి యేసయ్యను చూపించి నిత్య జీవమునకు నేరుగా నడిపించుదుము గాక. ఆమెన్! 

- బ్రదర్. భాగ్యనాధన్ గారు 

 

ప్రార్థన అంశం: 

మోక్ష ప్రయాణం ధిన ధ్యాన పత్రికలు చదువుతున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet