Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.04.2023
Share:

By Village Missionary Movement

Thursday, 13-Apr-2023

దిన ధ్యానము(Telugu) 13.04.2023

 

అంశం: నలుపు మరియు తెలుపు

 

"దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు" - యోహాను 3:20

 

ఒక పూల తోటలో తాత మరియు మనవడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాలుగవ తరగతి చదువుతున్న ఆ చిన్నవాడు తాతయ్యకు ఒక ప్రశ్న అడిగాడు. తాత తాత నా కలలో తరచుగా రెండు కుక్కలు వస్తున్నాయి. ఒకటి తెలుపు రంగులో ఉంది మరొకటి నలుపు రంగులో ఉంది. ఎప్పుడు చూసినా అవి గొడవ పడుతూనే ఉంటాయి. ఈ రెండు కుక్కలలో ఏ కుక్క గెలుస్తుంది అనేది తెలియడం లేదు అని అన్నాడు. అందుకు తాత ఏ కుక్కకు ఆహారం పెడితే ఆ కుక్క గెలుస్తుంది అని అన్నాడు. 

 

నిజమే మానవ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. మన హృదయంలో దేనికి అధికముగా చోటు ఇస్తామో అదే మన ఆలోచనలను అతిక్రమించుకుంటుంది క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. హృదయ సమృద్ధి వలన వారి నోరు మాట్లాడుతుంది. అదే క్రియలుగా మారుతుంది. 

 

శారీరక ఆలోచన మరణం. అనేక చీకటి వంటి క్రియలు మన జీవితంలో ఉంటే మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు నివాసము ఉండలేరు. లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించే వెలుగు అయినా యేసుక్రీస్తు వద్ద మనలను మనము సమర్పించుకుంటే మనకు ఆయన విడుదలను ఇచ్చి మన క్రియలను సత్క్రియలుగా మార్చుతారు. నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. 

 

పరిశుద్ధ గ్రంథంలో గలతీ 5:19 -21 వచనాలలో శరీర కార్యములు గూర్చి ఆత్మఫలములను గూర్చి తెలుసుకొనగలము. యేసే మార్గము, సత్యము, జీవము కాబట్టి ఆయనను మన దేవునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తే అగ్ని తీర్పు నుండి మనలను తప్పించుకోవచ్చు. నిత్యజీవమును పొందవచ్చు. ఆమెన్! 

- శ్రీమతి. జయంతి భాగ్య నాథన్ గారు 

 

ప్రార్థన అంశం: 

7000 మంది మిషనరీలను ఏర్పాటు చేసే పనులలో సేవా స్థలాలలో సేవకులకు దేవుడు సహాయము చేయు లాగా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet