Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.04.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Apr-2023

దిన ధ్యానము(Telugu) 12.04.2023

 

అంశం: కోడి కూత

 

"అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడికూసెను" - మత్తయి 26:74 

 

కోడి వేకువ జామున ప్రజలను తట్టి లేపుతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ కోడికి ఒక స్థానాన్ని ఇచ్చారు. కోడిపుంజు మన ముందు నడుస్తూ వస్తున్నప్పుడు దాని యొక్క గాంభీరము చాలా అందంగా ఉంటుంది. అది చూసి దుకాణదారుడు ఈ కోడి మంచి ధరకు అమ్మబడుతుంది అనుకుంటాడు. మనం మాత్రము ఇది ఎవరి కోడి మా తోటలోనికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులకు కోడి అన్న వెంటనే పేతురు గుర్తుకు వస్తాడు. కోడి ఒక మహిమ గల హెచ్చరిక కలిగినది అని కూడా అనవచ్చు. ఈ కోడి పేతురు సంతాపపడి ఏడ్చేలా చేసింది. ఎంతమంది సువార్తికులు వచ్చినా సరే ఒక్కరి హృదయంలో కూడా ఉజ్జీవపు అగ్ని కలగడం లేదు కానీ కోడి చీకటిలో శబ్దమును కూసినప్పుడు ఆ కూత పేతురును ఏడ్చేలా చేసింది. కోడి ద్వారా పేతురు గ్రహించగలిగాడు. సిలువ ముందు మనలను సంపూర్ణముగా తగ్గించుకునేలా చేయుటకు దేవుడు దేని ద్వారానైనా సరే మనతో మాట్లాడతారు. బిలాము ప్రవర్తనను హెచ్చరించుటకు దేవుడు గాడిద నోటిని తెరవలేదా. 

 

ఈ కోడి కూత మనము దేవుని కృప ద్వారా జీవిస్తున్నాము అనే వార్తను కూడా ప్రకటిస్తుంది. కానీ మనుష్యుడు గర్వముగా మాట్లాడి సొంత బలము పైన అనుకుని కింద పడిపోతూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినప్పుడు పేతురు గ్రహించలేదు సొంత బలమును నమ్మాడు. గెత్సేమనే తోటలో ప్రార్థించి ఉంటే దేవుని బలమును పొందుకొని ఉండేవాడు. కానీ పేతురు దేవుని తిరస్కరించడానికి గల కారణము అజాగ్రత్త, సొంత బలమును నమ్ముట. 

 

దేవుని పిల్లలారా ఆనాడు కోడికూత పేతురును దేవుని ప్రేమను గ్రహించేలా చేసింది. ఈ ధ్యానం ద్వారా దేవుడు మీతో ఐక్య పడుతున్నారు. పనిని సరి చేయండి కఠినంగా ఉండవద్దు. విరిగిన హృదయముగల వారికి యెహోవా సమీపిస్తుడు. ప్రభువు పేతురుకు ఎలా ఆది ప్రేమను గ్రహింపజేసి నూతన జీవితమును ఇచ్చారో అలాగే మీకు కూడా చేయగలిగే శక్తిమంతుడై ఉన్నారు. మరలా దేవుని చెంతకు పరిగెత్తుకొని వచ్చిన పేతురు వలె ఆయన చెంతకు రండి. 

- శ్రీమతి. గ్రేస్ జీవామని గారు

 

ప్రార్థన అంశం: 

మన ఆఫీసులో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రభువు ప్రత్యేక జ్ఞానముతో నింపేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet