Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.04.2023
Share:

By Village Missionary Movement

Monday, 10-Apr-2023

దిన ధ్యానము(Telugu) 10.04.2023

 

అంశం: దేవునికి తెలుసు

 

"యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది" – 2 దినవృత్తాంతములు 16:9

 

ఒక రోజు నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ముగ్గురు కూర్చుని ఉన్న ఒక సీటులో నా పక్కన ఒక యవ్వనస్తురాలు హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ ఉంది. ఆమె పక్కన ఒక వృద్ధురాలు కూర్చుని ఉన్నారు. కొంచెం సమయం తర్వాత తల్లి పక్కన ఉన్న యవ్వనస్తురాలతో నా ఫోన్లో చార్జింగ్ లేదు కాబట్టి నీవు చెవిలో పెట్టుకున్నది తీసి నా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టగలవా అని అడిగారు. అందుకు ఆ యవ్వనస్తులు నవ్వుతూ అమ్మ దీనితో చార్జింగ్ పెట్టడం అవ్వదు అని చెప్పింది. పెరుగుతున్న టెక్నాలజీ మన తల్లిదండ్రులకు లేదా ఇంట్లో ఉండే పెద్దవారికి అర్థం అవడం చాలా కష్టం. అందుకే వీటిని ఉపయోగించి నా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు అనుకొని యవ్వనస్తులు అనేక పాపములకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది అని మర్చిపోతున్నారు. మనము చేసే పాపపు క్రియలను ఆయన చూస్తూ ఉన్నారు. 

 

పరిశుద్ధ గ్రంథంలో కూడా సంసోనుకు దేవుడు బలాన్ని ఇచ్చారు. సంసోను గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపాడు అది మాత్రమే కాదు ఒక సింహపు దవడను చీల్చివేశాడు. దేవుడు ఇచ్చిన బలమును చక్కగా ఉపయోగించుకొనకుండా లోకాసలకు చోటు ఇచ్చి పాపములో పడిపోయాడు. తన తల్లిదండ్రులకు లోబడకుండా వారికి ఇష్టము లేని అన్య స్త్రీని వివాహము చేసుకున్నాడు. అతని బలము ముందు తల్లిదండ్రుల యొక్క మాటలు స్వల్పముగా మారాయి. అతని అంతము చాలా దుఃఖకరముగా మారింది. 

 

యవ్వనస్తులారా మీ తల్లిదండ్రులకు విద్యాభ్యాసము మరియు లోకజ్ఞానము లేకపోవచ్చు. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు అని మీరు వారిని మోసం చేయవచ్చు. కానీ మీ మనసులో దేవుని యొక్క భయం ఉంటే మీరు లోకాసలకు చోటు ఇవ్వలేరు అని తెలుసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క పాపమునకు ఒకరోజు దేవుడు లెక్క అడుగుతారు అనే నిజము మిమ్మల్ని పాపములో పడకుండా కాపాడుతుంది. యవ్వనస్తులారా ఇప్పుడే మీ మనసులో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందును అనే వాక్య ప్రకారము తన పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు మీ పాపములను క్షమించి మీ జీవితంలో నూతన కార్యములను జరిగిస్తారు. ఆమెన్! 

- సహోదరి. ఎస్ అంజలిగారు 

 

ప్రార్థన అంశం: 

యవ్వనస్తుల కూడికకు అనేక మంది యవ్వనస్తులను తీసుకుని వచ్చే వాలంటీర్లు లేచులాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet