Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.04.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 09-Apr-2023

దిన ధ్యానము(Telugu) 09.04.2023 (Kids Special)

 

అంశం: జయించెను

 

“అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;” - యోహాను 11: 25

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం. 

హలో పిల్లలు బాగున్నారా? పరీక్షలు అయిపోయాయా? కొంతమందికి పరీక్షలు అవుతున్నాయి. ఇంకొంతమంది పరీక్షలు యొక్క ఫలితాల కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు. ఏదేమైనా యేసయ్య మీతో ఉంటే విజయము మీ సొంతమే. యేసుక్రీస్తు మరణమును, సాతానును జయించి తిరిగి లేచిన రోజునే ఈస్టర్ పండుగగా మనము జరుపుకుంటున్నాం. సంతోషంగా ఉన్నారా? మీతో ఉన్న వారిలో ఎవరైనా బాధతో ఉంటే వారికి హ్యాపీ ఈస్టర్ చెప్పి మీరు చేయగలిగిన సహాయము చేయండి ఓకేనా పిల్లలు. 

 

ఒక సండే స్కూల్ టీచర్ ఒక సీనియర్ , స్టూడెంట్స్ తో వచ్చేవారం వచ్చినప్పుడు మార్కు సువార్త 17వ అధ్యాయము చదువుకొని రావాలి అని చెప్పారు. వెళ్తున్న దారిలో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయడానికి, పరీక్షలు కొరకు చదవడానికి టైమే లేదు మరి ఇంకా ఇది కూడా చదవాల అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు చదువు ఎంత ముఖ్యమో సండే స్కూల్లో చెప్పే పరిశుద్ధ గ్రంథము నుండి పాఠాలు కూడా అంతే ముఖ్యం ఈ విషయం చాలామందికి తెలియకపోవడం వలన చిన్న వయసులోనే సాతాను యొక్క వలలో చిక్కి బానిసలుగా మారిపోతున్నారు. మీరందరూ మంచి పిల్లలు కదా సూపర్.

 

మరుసటి ఆదివారం వచ్చేసింది ఎవరెవరు మార్కు సువార్త 17వ అధ్యాయం చదివారు చేతులెత్తండి అని టీచర్ అడిగిన వెంటనే అందరూ చేతులెత్తేశారు. టీచర్ నవ్వుతూ మార్కు సువార్తలో 16 అధ్యాయాలే ఉన్నయి కదా అని అన్నారు. అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. వారం మొదటి దినాన వేకు జామున సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సమాధి తెరవబడి ఉన్నది యేసు తిరిగి లేచారు. ఆయన ఇక్కడ లేరు అనే శుభవార్త మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నదానిని కథల టీచర్ వారికి చెప్పారు. అందరు హృదయాలలో పునరుద్దాన మహిమ క్రియ జరిగించడం మొదలుపెట్టింది. టీచర్ మేము ఇప్పుడే మార్కు సువార్త 16వ అధ్యాయం చదువుతాం అని పిల్లలందరూ చెప్పారు దానికి టీచర్ కూడా చాలా సంతోషించారు. అందరూ వ్యక్తిగతముగా యేసయ్యను రుచి చూడడం మొదలుపెట్టారు. పాపమును ఒప్పుకొని తిరిగి లేచిన దేవుని చేతులకు తమ్ముని సమర్పించుకున్నారు. ఆ రోజే ప్రతి ఒక్క హృదయంలో పండుగ సంతోషం వచ్చింది. అందరూ అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్ చెప్పుకున్నారు. చిన్న పిల్లలు మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అని టీచరు కూడా చెప్పారు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి! మీ జీవితంలో కూడా పునరుద్దానుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమను చూడాలి అని ఆశపడుతున్నారా? మీ శాపముల కొరకే సిలువను మోసిన రక్షకుని మీ హృదయంలోనికి అంగీకరిస్తే మిమ్మును అంతము వరకు ఎత్తుకొని విజయముతో జీవించేలా మీకు సహాయం చేస్తారు. హల్లేలూయా! 

 

శ్రీమతి జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet