Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.04.2023
Share:

By Village Missionary Movement

Saturday, 08-Apr-2023

దిన ధ్యానము(Telugu) 08.04.2023

 

అంశం: చివరిగా

 

"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను" - లూకా 23:46

 

యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన ఏడవ మాట. చనిపోతున్న ఒక వ్యక్తి నోటి నుండి ఏమైనా మాటలు వస్తాయేమో అని ఆతృతగా తన తల చుట్టూ కుటుంబీకులు కూర్చుని చూస్తూ ఉంటారు. అతడు చివరిగా మాట్లాడిన మాటలను ప్రాముఖ్యమైన మాటలుగా పరిగణిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు మాట్లాడిన ఏడు మాటలలో

ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనునది. మొదటి మాటలో తండ్రి అని పిలిచి చివరి మాటలో కూడా తండ్రి అని పిలుస్తూ ప్రార్థించడం మనం చూస్తున్నాం. 

 

ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ద్వారా ఈ లోకమునకు పంపబడుటకు ఒకే ఒక కారణం మానవజాతి పాపము కొరకై తన్ను తాను బలిగా అప్పగించుకొనుట కొరకే. పాపము నుండి విడిపించుటకు ఆయన ఈ లోకంలో 33½ సంవత్సరములలో కొంచమైనా విశ్రాంతి తీసుకొనకుండా తండ్రి అప్పగించిన బాధ్యతను నెరవేర్చుటకు శ్రమలను, ఇబ్బందులను, శోధనలను, బాధలను జయించి విజయవంతముగా సంపూర్ణమైన జీవితమును జీవించారు. 

 

ఒకరు ఈ భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించారో అనేది ముఖ్యము కాదు ఎలా జీవించారో అనేది ముఖ్యం. మన యొక్క జీవితము దేవుని మహిమ పరిచే జీవితము వలె మనకు ఇచ్చిన సమయంలో మనము నెరవేర్చవలసిన బాధ్యతలను నెరవేర్చే జీవితం వలే ఉన్నదా అని పరిశీలించి చూసుకుందాం. 

 

తండ్రి చిత్తమును నెరవేర్చుటయే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహారమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. అధికమైన ఆకలితో ఉన్న ఒకడు ఆహారంపై ఎంత ఆతృత కలవాడై ఉంటాడో అలానే యేసుప్రభు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు అధిక ఆత్రుత గలవారైయున్నారు. 

 

ఒలింపిక్ పందెంలో ఒలింపిక్ ద్వీపమును పట్టుకొని వచ్చేవారు కొంచెం దూరం పరిగెత్తి తరువాత దానిని మరొక వ్యక్తికి ఇచ్చి తనతో కలిసి పరిగెడతాడు. ఆ ద్వీపమును నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి అని ఒకరి తర్వాత ఒకరికి అందించబడుతూ చివరికి అది వెలుగుతూ కాలిపోతుంది. ఇదే విధముగా తండ్రి అప్పగించిన బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి మనకు దానిని అప్పగించారు. ఆ బాధ్యతను మనం నెరవేర్చి ద్వీపమును వెలిగిద్దాం. మనము కూడా చివరి వరకు దేవుని చిత్తము నెరవేర్చి మన జీవిత పరుగును సంతోషముగా దేవునిలో నెరవేర్చుదాం. హల్లెలూయ!

- శ్రీమతి. జబ డేవిడ్ గణేషన్ గారు 

 

ప్రార్థన అంశం: 

తమిళనాడులో గల తిరుచిలో జరగబోతున్న ఉజ్జీవ యవనస్తుల కూడిక కొరకు మన సేవకులు తీసుకుంటున్న ప్రయాసలలో దేవుని హస్తము తోడు ఉండేలాగా ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet