Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.04.2023
Share:

By Village Missionary Movement

Friday, 07-Apr-2023

దిన ధ్యానము(Telugu) 07.04.2023

 

అంశం: సమాప్తమైనది. 

 

"యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను" - యోహాను 19:30

 

యేసు క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన ఆరవ మాట. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఏడు మాటలలో ఆరో మాట సమాప్తమైనది. ఏవేవి సమాప్తం అయ్యాయో చూద్దాం. 

 

1. దైవ కుమారుని యొక్క మానవ ప్రయాణం సమాప్తమైనది. ఆదాము హవ్వ చేసిన పాపమును తొలగించుటకు మనిషినిగా అవతరించి మనుషులను రక్షించుకోవడం కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అవ్వడం సమాప్తమైనది. 

 

2. ప్రవచనములు నెరవేరి సమాప్తమైనవి. మోషే మొదలుకొని అనేకమంది ప్రవక్తల ద్వారా రాయబడిన లేఖనములు అన్ని నెరవేరి సమాప్తమైనవి. 

 

3. దేవుడైన తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. యేసు తన శిష్యులతో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పారు. రక్షణ ప్రణాళిక సిలువ బలియాగం పై నెరవేరింది. అందుకే యోహాను 17: 4 లో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని యేసుక్రీస్తు ప్రభువు ధైర్యంగా చెబుతున్నారు. 

 

ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చితిని అని చెప్పిన యేసుక్రీస్తు సిలువలో ఆ మాటను నెరవేర్చారు. 

ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అనే వాక్యము ప్రకారంగ తన సొంత రక్తమును ఇచ్చి పాపక్షమాపణను మనకు అనుగ్రహించి తన గొప్ప పనిని ముగించారు. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును పూర్తి చేసి సమాప్తమైనది అని అన్నారు. అది బాధతో కూడిన స్వరము కాదు విజయపు కేకలు. దేవుని చిత్తమును నెరవేర్చానన్న ఒక ఉపసమనం. 

 

తన జీవిత బంధమును ముగించే సమయంలో కొంతమంది మాట్లాడే మాటలను చూద్దాం. దేవుడు లేడని చెప్తూ జీవిస్తున్న వాల్టయర్ తాను మరణ అంచుల్లో ఉన్నప్పుడు అయ్యో మనుషులు చేత దేవుని చేత చేయి విడవబడే స్థితికి వచ్చాను నరకమునకు వెళ్ళిపోతున్నాను అని బిగ్గరగా విలపించాడు. 

 

సువార్త కొరకు లోకమంతా ఉపయోగపడుతున్న అనేకులను యేసయ్య చెంతకు నడిపించిన దైవజనుడు డి.ఎల్ మూడీ తన జీవిత చివరి రోజుల్లో ఇది మరణపు రోజు కాదు పట్టాభిషేకం చేసే రోజు, నా యేసుక్రీస్తు కిరీటమును పట్టుకొని నా కొరకు వేచి ఉన్నారు అని సంతోషంగా అన్నారు. 

 

మనము మన జీవిత చివరి దినాలను ఎలా పూర్తి చేయబోతున్నాం? అని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయ! 

- శ్రీమతి. వనజ బాలరాజ్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీలో పనిచేసే మంచి అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులు కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet