Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.04.2023
Share:

By Village Missionary Movement

Thursday, 06-Apr-2023

దిన ధ్యానము(Telugu) 06.04.2023

 

అంశం: దప్పిగొనుచున్నాను

 

"అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను" - యోహాను 19:28 

 

యేసు క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన ఐదవ మాట. ఎవడైనను దప్పికగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యోహాను 7: 37-38 వచనాలలో మన ప్రభువైన యేసు చెప్పారు. ఇలా మన దాహమును తీరుస్తాను అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభువు తాను దప్పిగొనుచున్నాను అని అంటున్నారు. సిలువలో యేసుక్రీస్తు యొక్క దాహం ప్రజల ఆత్మల కొరకైన దాహం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని ప్రవక్త అయిన యెషయా యెషయా గ్రంథం 53:11 లో చాలా చక్కగా రాశారు. తన పోలిక చొప్పున సృష్టింపబడిన మనుషులు తన మందలోనికి వచ్చి చేరాలి అనేదే మన దేవుని యొక్క గొప్ప దాహం. మందలో చేరిన గొర్రెలను ఆయన వద్దకు తీసుకుని వెళ్లే పనిలో మనము ఐక్యపడినప్పుడు అతని యొక్క దాహమును తీర్చే వారి వలె ఉంటాం. 

 

ఇందు కొరకు అని ఒక నిజ సంఘటనను చెప్పడానికి వచ్చాను. 1780 సంవత్సరంలో రాబర్ట్ రైకస్ లండన్ నగరం చుట్టూ ఉన్న స్థలాలలో నివాసం చేస్తున్న విద్యాభ్యాసము లేని పిల్లల కొరకు మనసులో భారము కలిగి ఉన్నారు. వారి జీవితమును మార్చుటకు ఏదైనా చేయాలి అని ప్రయత్నం చేశారు. ఆదివారము ఆ పిల్లలకు పాఠశాలలలో తరగతులు చెప్పాలని కొంతమంది స్త్రీలను ఏర్పరిచారు. పరిశుద్ధ గ్రంథమును పుస్తకముగా ఉపయోగించి ఆ ఉపాధ్యాయులు పేద పిల్లల కొరకు చదవడం నేర్పించారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్న జ్ఞానమును వారికి బోధించారు. 100 మంది పిల్లలతో మొదలైన ఆ ఆదివారపు పాఠశాల అతి తక్కువ సమయంలోనే వేల కొలది పిల్లలను చేరుకోగలిగారు. 1831లో లండన్ నగరంలో ఆదివారపు పాఠశాలలు 10 లక్షల కంటే అధికమైన పిల్లలు వద్దకు చేరాయి

 

రాబర్ట్ అనే ఒక ఒంటరి వ్యక్తి ఒక ప్రయత్నం అని చెప్పడం కంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసుకున్నారు అని చెప్పవచ్చు. ఆకలితో ఉన్నవారు ఆధారం లేని వారిపై మనము చూపించే ప్రేమ అనేది మన దేవుని యొక్క దాహమును తీరుస్తుంది. మరి మన ప్రభువైన యేసయ్య యొక్క దాహం తీర్చుటకు ఆయన మనలను నడిపించును గాక. ఆమెన్! 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:

ఆమెను విలేజ్ టీవీ ప్రసారం అగుటకు అవసరమైన ఆర్థిక అవసరతలు సంధింపబడిన ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet