Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.04.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 04-Apr-2023

దిన ధ్యానము(Telugu) 05.04.2023

 

అంశం: దేవుడు ఎక్కడ ఉన్నాడు? 

 

"ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము" - మత్తయి 27:46

 

యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన నాలుగో మాట. క్రిస్టియన్ అండ్ మిషనరీ లైన్స్ ఉద్యమ స్థాపకుడు శ్రీ ఏ. బి. సంసోను. ఇతని యొక్క జీవిత చరిత్రను ఏ.డబ్ల్యూ.డోజర్ రాసిన వింగ్స్ స్ప్రెడ్ అనే పుస్తకంలో మనం చదవవచ్చు. రక్షింపబడి పరిచర్య చేయడం ప్రారంభించిన సంసోను జీవితంలో ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. కానీ ఒక నిర్దిష్ట సమయంలో శరీర బలహీనముతో ఆత్మీయ చీకటి ఒకటి తన జీవితంలోనికి వచ్చింది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే వేదన అతని హృదయంలో ఉండేది. ప్రార్థన మరియు బైబిల్ ధ్యానము వంటివి ఏవియు ఆ సమయంలో అతనికి సహాయం చేయలేదు. ఈ వేదనలో చిక్కిన అతను తిరిగి లేవడానికి అనేక దినములు పట్టాయి. 

 

ఇలా దేవుని ప్రసన్నత లేకుండా ఒకవేళ దేవుడే లేడు అని అనిపించే ఈ పరిస్థితి క్రైస్తవ జీవితంలో ఒక భాగం అని ఏ. డబ్ల్యూ. డోజర్ రాశారు. ప్రాముఖ్యంగా దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించి ఆయన కొరకు ఏదైనా చేసిన వారి జీవితంలో ఇవి సహజం అంటున్నారు. మనము మన భావాలపైన, పరిస్థితులపైన ఆనుకొనకుండా దేవుని యందు విశ్వాసముతో దేనినైనా సాధించేందుకు సహాయం చేసే క్షణాలు ఇవి. 

 

మనుషునికి మరియు దేవునికి గల బంధమును మరియు దాని స్వభావమును తెలుసుకునే గ్రంథము కీర్తనల గ్రంథము. కీర్తన 16:11 లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వివరించి చెప్పిన దావీదు రాజు కీర్తనలు 22:1 లో నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి అని అంగలార్చుచున్నాడు. సంఘ చరిత్రను తిరిగి చూస్తే క్రైస్తవులలో అనేకులు ఈ అనుభవాలు తమ జీవితంలో కలిగి ఉండడం సాక్షంగా చెబుతారు. దేవుని యొక్క ముఖము దాచబడే ఈ ఘోరమైన అనుభవాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో అనుభవించారు. కీర్తన 22:1 లో ఉన్న మాటలను పలికి ఆయన కూడా అంగలార్చుచున్నారు. కాబట్టి ఆయనకు మన అనుభవాలు అర్థమవుతాయి. 

 

ప్రియమైన వారలారా! ఇదే విధముగా ఆత్మీయ చీకటి కూడా మన జీవితంలోనికి వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిని కూర్చుందాం. ఇతర విశ్వాసులతో ఉన్న ఐక్యములో దేవుని యొక్క ముఖ ప్రకాశము త్వరలో మన పైన ప్రకాశిస్తుంది. ఆమెన్! 

- బ్రదర్. జె. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ ఛానల్ ఆటంకం లేకుండా తమిళనాడు అంతా కూడా ప్రసారమయ్యేలా ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet