Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.04.2023
Share:

By Village Missionary Movement

Monday, 03-Apr-2023

దిన ధ్యానము(Telugu) 04.04.2023

 

అంశం: ఇదిగో నీ తల్లి

 

"యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను" - యోహాను 19:26 

 

యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడో మాట. యేసు క్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు మాట్లాడిన ప్రతి మాటకు ఎంతో అర్థం ఉంది. సాధారణంగా చనిపోయే స్థితిలో ఉన్న ఒకరు తన కుటుంబ బాధ్యతలను అర్హత కలిగిన వారికి అప్పగిస్తారు. భర్త అయితే తన భార్యకు లేదా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే పెద్ద కుమారునికి మిగతా పిల్లలు చూసుకునే బాధ్యతను అప్పగిస్తారు. అదేవిధంగా మన ప్రభువైన యేసు భర్త లేని తన తల్లి మరియ యొక్క బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగిస్తున్నారు. 33½ సంవత్సరాల కాలంలో లోకంలో తండ్రి తనకు అప్పగించిన సమస్తమును నెరవేర్చారు. యేసు ప్రభువు ఆ ఘోరమైన శ్రమల మధ్యలో కుటుంబంలో తనకు ఉన్న బాధ్యతలను శ్రద్ధగా నెరవేర్చడం మనం చూస్తున్నాం. 

 

ఈ లోకంలో ఎవరికీ దొరకని భాగ్యం మరియకు దొరికింది. దైవ కుమారుడైన యేసును గర్భంలో మోసి జన్మనిచ్చి పెంచే బాధ్యత గొప్ప భాగ్యము. కానీ నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అని ప్రవక్త చెప్పబడిన మాటలు నెరవేర్చబడుటకు యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉండుట చూడలేక కన్నీరు కార్చింది. మరియ ఇకనుండి నన్ను ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన మరియలో ఉందో లేదో కానీ ఘోరమైన శ్రమల మధ్యలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువునకు ఆలోచన ఉంది. యేసు ప్రభువు సిలువలో వేలాడినప్పుడు అనేక మంది శిష్యులు పారిపోయారు కాని యోహాను మాత్రమే మరియ దగ్గర నిలిచి ఉన్నాడు. ఆయన గుండెల పైన ఆనుకొనిన యోహానుకు అతని యొక్క హృదయ భారం అర్థం అవుతుంది. అతడే అర్హత కలవాడు అని చెప్పి మరియను తనకు అప్పగించారు. కన్నవారిని చూసుకొనుటలో లోకమునకు ఒక ఉదాహరణ యేసుక్రీస్తు. 

 

ప్రియమైన వారలారా! మనకు కూడా ఈ బాధ్యత కలదు. దానిని మనము నిశ్చయముగా నెరవేర్చాలి. ఈరోజుల్లో పిల్లలు వివాహము, ఉద్యోగము అని దూర దేశాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఆశీర్వాదం అనే సత్యాన్ని అంగీకరించే మనసు లేక పోతుంది. కొంతమంది అయితే తల్లిదండ్రుల నుండి ఆస్తిని తీసుకుని వారిని పూర్తిగా మర్చిపోతున్నారు. ఆశీర్వాదముతో ఐక్యపడి ఉన్న ఒకే ఒక ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనునది. మనము యేసయ్య యొక్క మాదిరిని అనుసరించి ఆశీర్వాదకరమైన సంతతివలె ఈ లోకంలో జీవిద్దాం. హల్లెలూయ! 

- శ్రీమతి. భువన ధనబాలన్ గారు 

 

ప్రార్థన అంశం: 

సేవా స్థలాల్లో పరిచర్య కొరకు ద్విచక్ర వాహనాలు అవసరమై ఉన్నవి సహాయం చేసే వ్యక్తులు లేచు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al