Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.03.2023
Share:

By Village Missionary Movement

Friday, 31-Mar-2023

దిన ధ్యానము(Telugu) 31.03.2023

 

అంశం: తీర్పు తీర్చవద్దు

 

"మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు" - మత్తయి 7:1

 

నిమ్మి అనే చిన్నదాని చేతిలో రెండు ఆపిల్ పండ్లు ఉన్నాయి. వాళ్ళ అక్క తనకు ఒకటి కావాలి అని అడిగింది. అప్పుడు నిమ్మి రెండు ఆపిల్ పండ్లను కూడా కొరికేసింది. వెంటనే వాళ్ళ అక్క నువ్వు సరైన దానివే ఎవరికీ ఏమీ ఇవ్వవు నిన్ను అస్సలు నమ్మకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిమ్మి తన అక్క దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుని ఒక ఆపిల్ తన చేతిలో పెట్టి ఇది చాలా తియ్యగా ఉంది దీనిని తీసుకో అని చెప్పింది. వెంటనే అక్క తన తప్పును గ్రహించి చెల్లిని దగ్గరగా తీసుకుని హత్తుకుంది. 

 

ఇదే విధముగా మనము కూడా అనేక సమయాలలో ఒకరి ప్రవర్తనను చూసి తప్పుగా అర్థము చేసుకొని వీరు ఇంతే అనుకొని మాట్లాడేస్తుంటాం లేదా తీర్పు తీర్చేస్తుంటాం. కీర్తనలు 50:20 లో నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అని చెప్పి యెహోవా హెచ్చరిస్తున్నారు. పరిసయ్యుని ఇంటిలో భోజన బంతిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలపైన అత్తరు పూసిన మరియను ఒక పాపి వలె చూశాడు ఆ పరిసయ్యుడు కానీ యేసయ్యా ఆ స్త్రీని మిక్కిలి ప్రేమ కలిగిన స్త్రీగా చూశారు. కాబట్టి మనము ఇతరులను చూసే విధానము యేసయ్య వలె మారితే బాగుంటుంది. మనం ఇతరులను న్యాయము తీర్చాలి అనుకున్నప్పుడు మన కంటిలో ఉన్న దూలమును గ్రహించే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక! 

 

ప్రియమైన వారలారా మన చూపులు, మన మాటలు విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఇతరులను చూసి వీరు లోటు గలవారు వీరు మంచివారు అని న్యాయము తీర్చి మాట్లాడవద్దు. దావీదు వలె యెహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థించి శోధన జయిద్దాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోవుదుము అని 1 కొరింది 11:31లో మనం చదువుతున్నాం. ఇంతవరకు ఇతరులకు న్యాయము తీరుస్తూ మాట్లాడిన ప్రతి మాటను దేవుని యొద్ద ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం. ఈ తప్పు మరలా చేయకుండా ఉందాం. సమస్తమైన కావలితో మన హృదయాన్ని కాపాడుకుందాం. దానిలో నుండి జీవదారలు బయలుదేరును. హల్లెలూయ! 

- శ్రీమతి. అంబు జోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం: 

తెరపై క్రైస్తవ సినిమా పరిచర్య ద్వారా సంధింపబడుతున్న వ్యక్తులు యేసయ్యను తెలుసుకొని అంగీకరించరాలను ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet