Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.03.2023
Share:

By Village Missionary Movement

Thursday, 30-Mar-2023

దిన ధ్యానము(Telugu) 30.03.2023

 

అంశం: ఉత్తమమైన దానిని అనుగ్రహించును

 

"మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును" - యోహాను 14:13 

 

ఐదేళ్లు నిండిన విలియం తన తల్లితో కలిసి పుట్టినరోజు కొరకు బొమ్మల దుకాణానికి వెళ్లి తనకు నచ్చిన ఆట బొమ్మలను కొనుక్కోవాలి అనుకున్నాడు. ఆ దుకాణమునకు వెళ్లాక అక్కడ చాలా బొమ్మలు ఆట వస్తువులు ఉన్నాయి. అక్కడ తనకు నచ్చిన రంగు రంగుల లైట్లతో రకరకాల శబ్దాలతో వేగంగా వెళ్లే కారు కూడా ఉంది. ఆ కారును చూసిన వెంటనే అది నాకు ఎలాగైనా కావాలి అని అల్లరి చేస్తూ అమ్మని వేధించాడు. తన తల్లి సరే చూద్దాం అని ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు తన పుట్టినరోజు నాడు అదే కారు తనకు బహుమతిగా ఇవ్వబడింది. దానిని చూసిన విలియంకు పట్టలేనంత సంతోషం. అప్పుడు తన సహోదరుడు ఈ కారుకే ఇంత సంతోషిస్తున్నావే అమ్మ దీనికంటే మంచి రిమోట్ కారును నీకు కొని బహుమతిగా ఇవ్వాలి అనుకున్నారు అని అన్నాడు. కానీ నువ్వు ఈ కారు కొనమని ఇబ్బంది పెట్టడం వలన దీనిని కొనిచ్చారు అన్నారు. దానిని విన్న విలియంకు చాలా బాధ అనిపించింది. 

 

నూతన నిబంధనలో యోహాను రాసి పత్రికలో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును అని వ్రాయబడి ఉన్నది. మనము దేవుని వద్ద ఏడ్చి బ్రతిమాలి మన అవసరతలను చెప్పి వాటిని పొందుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు కూడా వాటిని మనకు ఇస్తున్నారు. కానీ ఒకవేళ దేవుడు మనము అడిగిన దానికంటే ఉత్తమమైన దానిని ఇచ్చుటకు ఇష్టపడి ఉండవచ్చు కానీ మన ప్రార్థన వాటిని ఆటంక పరుస్తుంది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మనము మన యొక్క అవసరాలను తీర్చమని మాత్రమే అడుగుతాం అయితే మన దేవుడు వాటిని ఇచ్చే శక్తివతుడే. కానీ ఇందులో మహిమ పరచబడరు. మనము ప్రార్థన చేసినప్పుడు నీ చిత్త ప్రకారంగా మాకు అనుగ్రహించుము ప్రభువా అని ఆయన చిత్తమునకు అప్పగించి ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తమమైన దానిని ఇచ్చే సర్వశక్తిమంతుడై ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క ఆశ కోరికలను ఆయనతో చెప్పి ఆయన దయచేసే మేలులను పొందుకుందాం. దానివలన తండ్రి నామము మహిమ పరచబడుతుంది. ఆమెన్! 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం: 

మన దగ్గర నుండి పూర్తి బైబిల్ పొందుకున్న ప్రతి ఒక్కరూ దానిని క్రమముగా చదివి సత్యములో పెరుగులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al