Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.03.2023
Share:

By Village Missionary Movement

Thursday, 16-Mar-2023

దిన ధ్యానము(Telugu) 16.03.2023

 

అంశం: అతిక్రమించిన తర్వాత కూడా ద్వేషించనివాడు

 

"ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును" - కీర్తనలు 27:5

 

ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఆయనను బాధపెట్టే అనేక కార్యాలను మనము చేసినప్పుడు మనలను ద్వేషించని మన చేయి విడువని వారు ఒకే ఒక్కరు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనలను విడివని ఎడబాయని వాడు. ఒకవేళ మన యొక్క గతం లేదా మనము చాటుగా చేసిన పాపము మనతో ఉన్నవారికి తెలిస్తే మనలను ప్రేమిస్తున్నాము అని చెప్పే అనేకులు మనతో ఉండరు. దానికి తోడు మనలను ద్వేషిస్తారు కూడా. కానీ ఆయన మాత్రం నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి రారా? తమ పాపాలను విడిచి మారుమనస్సు పొందరా? అని కన్నీటితో మన కొరకు వేచి ఉన్నారు. 

 

నా యవ్వన కాలంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడ లేనప్పుడు నన్ను క్రీస్తులోనికి నడిపించిన సహోదరి నన్ను పిలిచి ప్రార్థన చేసేవారు. నేను కూడా గందరగోళ స్థితిలో ఒంటరితనములో ఆ సహోదరిని పిలిచి ప్రార్థన చేయమని అడిగే దానిని. ఒక రోజు నా మనసులో ఒక ప్రశ్న ఏర్పడింది. అదేమిటి అంటే నేను ఇప్పుడు నా సమస్య కొరకు ఈ సహోదరి సహాయము తీసుకుంటున్నాను. ఈ సహోదరే గాని లేకపోతే నేను ఎవరి సహాయము తీసుకుంటాను? అనే ప్రశ్న. ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభువు స్పష్టముగా నాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ నీలో ఉన్న నన్ను మర్చిపోయావు అన్నారు. నేను ఆ ప్రశ్నను గ్రహించాను. ఈ లోకంలో మనము ఆయనను పూర్తిగా విశ్వసించనప్పుడు లేదా ప్రేమించనప్పుడు కూడా ఆయన మనలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయనను ఏ ఒక్క రోజు కూడా మర్చిపోకూడదు. ఆయన ఒక్కరే నమ్మదగిన వారు మన రోదనలను ఆలకించి మనలను ఆదరించి ఓదార్చే ప్రేమగల దేవుడు ఆయనే. ఆయన చేతులను పట్టుకొని ఆయననే నమ్మి మనం ప్రయాణం చేసినట్లయితే ఎటువంటి ట్రాఫిక్ మన జీవితంలో ఉండదు. 

 

యవ్వన సహోదరీ సహోదరులారా! మనము దేవుని వద్ద ఈ లోకంలో ఎవరు నన్ను విడిచిపోయిన మీరు నన్ను విడిచి వెళ్లొద్దు మిమ్మును నేను పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నాను అనే హృదయా లోతులలో నుండి అడిగినప్పుడు ఆయన మనలను తన ఆత్మతో నింపగల శక్తిమంతుడై ఉన్నారు. హల్లెలూయ! 

- శ్రీమతి. దివ్య ఫెర్నాండ్ గారు

 

ప్రార్థన అంశం:

మన పత్రిక పరిచర్యలో రాసే పనిలో పాల్గొంటున్న వ్యక్తులను దేవుడు ఉత్తమమైన జ్ఞానము చేత నింపి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet