By Village Missionary Movement
Wednesday, 15-Mar-2023దిన ధ్యానము(Telugu) 15.03.2023
అంశం: క్రీస్తు యొక్క హస్తాలు
"చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి" - యెషయా 49:16
మెదడు యొక్క ఆదేశములను నెరవేర్చేవే చేతులు. స్నేహితులకు సంతోషముగా కరచాలనం చేయడము, ప్రేమగా చేతులు చాపి హత్తుకోవడం, రాయడం ఇలా చేతులతో చాలా పనులను చేస్తూ ఉన్నాం. చేతులు కూడా ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడమే లేఖనములు ఇచ్చే సలహా. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగినవాడు ఎవడు? వ్యర్ధమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే అని దావీదు చెబుతున్నాడు.
దేవుని బిడ్డ! యేసు క్రీస్తు యొక్క చేతుల గురించి కొంచెం ధ్యానిద్దాం. ఆయన చేతులు మృదువైన చేతులు, కానీ కష్టమైన పనులకు భయపడని చేతులు. వడ్రంగి పనిని ఆసక్తిగా చేసిన చేతులు. మన పనిని మనం నిజాయితీగా చేయుటకు ఉత్సాహపరిచే చేతులు. యేసయ్య చేతులు చిన్న పిల్లలను హత్తుకునే చేతులు. యాయీరు యొక్క కుమార్తె చిన్నదాన లేము అని చెప్పి ప్రాణము పోసిన చేతులు. పేతురు యొక్క అత్తను, కుష్టు రోగులను లెక్కలేని రోగములతో ఉన్నవారికి స్వస్థ పరిచే శక్తివంతమైన చేతులు. యేసుక్రీస్తు యొక్క చేతుల నుండి బయలు వెళ్లే కరుణ ఎంత గొప్పది, ఎంత మధురమైనది.
కల్వరి మార్గంలో యేసయ్య చేతులు సిలువను మోయవలసి వచ్చింది. ఆయన తన చేతులలో ఆ బరువును తట్టుకోలేకపోయారు. తన బలము చేత ఆ భారమైన శిలువను తన చేతులతో భరిస్తూ మోస్తూ యేరుషలేము వీధులలో నడిచారు. అది మాత్రమేనా సిలువలో ఆయన చేతులకు మేకులు దిగగొట్టారు. మన చేతి పైన ఒక ముల్లు గుచ్చుతేనే మనము తట్టుకోలేము, చేతులు వణుకుతున్నప్పుడు కూడా ఓపికగా భరించారు. చేతిలో ఉన్న నరాలన్నీ నొప్పితో నిండి ఉంటాయి. ఆ నొప్పి తల వరకు వెళ్లి మెదడు అంతా నొప్పి పెట్టి ఉంటుంది. తన చేతులలో మేకులు దిగగొట్టుటకు అప్పగించుకున్నారు
చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అని చెప్పి యున్నారు. దేవుని బిడ్డ! నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండుటకు నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నారు. ఆ ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పది.
- శ్రీమతి. గ్రేస్ జీవమని
ప్రార్థన అంశం:
స్వస్థతనిచ్చు ఆరాధనలో పాలుపంచుకుంటున్న స్నేహితులు ఆత్మ శరీర ప్రాణంలో విడుదల పొందుకొను లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250