By Village Missionary Movement
Sunday, 12-Mar-2023దిన ధ్యానము(Telugu) 12.03.2023
అంశం: మేలుకు ఫలితము కలదు
"మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము" - గలతియులకు 6:9
ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు
హలో పిల్లలు ఎలా ఉన్నారు? భోజనం చేశారా? బాగా నిద్రపోయారా? సరైన సమయంలో భోజనం చేయాలి. రాత్రిపూట ఎక్కువ సమయం మెలకువగా ఉండకుండా త్వరగా నిద్రపోవాలి అప్పుడే స్కూల్ కి చక్కగా సమయానికి వెళ్ళగలం. సరేనా!
సరే ఇప్పుడు ఒక కథ విందామా? ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రోస్ మేరీ అనే టీచర్ క్లాస్ టీచర్. చదువుకోడానికి మాత్రమే కాదు జీవితంలో కూడా ఉపయోగపడే మంచి విషయాలను కూడా నేర్పిస్తారు. మీకు తెలిసిన వారైనా తెలియని వారైనా మిమ్మల్ని ముట్టుకొని మాట్లాడిన, వారి వడిలో కూర్చోబెట్టి మాట్లాడిన మీరు అవాయిడ్ చేయాలి అని చెప్పడం మాత్రమే కాదు ఇంకా చాలా గేమ్స్ ను ఏర్పాటు చేసి ఆడుకోమని చెప్తారు. పిల్లలందరికీ ఆ టీచర్ అంటే చాలా ఇష్టం. ఆరోజు గేమ్స్ పీరియడ్ వచ్చింది. పిల్లలందరూ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. రోజ్ మేరీ టీచర్ పిల్లలందరికీ బెలూన్స్ ఇచ్చారు. మీకు కూడా బెలూన్స్ అంటే చాలా ఇష్టం కదా అందరూ బెలూన్ ఉదండి అని చెప్పారు టీచర్. టీచర్ చెప్పిన వెంటనే అందరూ ఊది ముడి వేసేసారు ఇప్పుడు అందరూ ఆ బెలూన్ పై మీ పేర్లను రాయండి అని చెప్పారు ఆ టీచర్. పిల్లలందరూ చాలా తొందరగా పేర్లను రాసేశారు.
ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారో తెలుసా అని టీచర్ అడగడంతో పిల్లలందరూ చాలా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. గెలవాలి అనే ఆశ అందరిలో ఉంటుంది కదా మీ బెలూన్ లో ఉన్న ముడిని విప్పి వాటిని తీసుకొని వచ్చి ఈ టేబుల్ పై పెట్టండి అని టీచర్ చెప్పారు. బెలూన్ నుండి గాలి బయటికి వచ్చినట్లు అందరి ముఖాలు కూడా చిన్న బోయాయి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. గాలిలో ఎగిరి చెదిరిపడి అక్కడక్కడ ఉన్న బెలూన్లలో మీ పేర్లను వెతకండి అని చెప్పారు టీచర్. వెతుకుతున్న ప్రతి ఒక్కరు వేరే పేర్లు గల బెలూన్ పట్టుకున్నప్పుడు వాటిని కింద పడేసేవారు. అప్పుడు టీచర్ ఒక ఐడియా ఇచ్చారు. వేరే వాళ్ళు రాసిన బెలూన్ ను తీసి ఆ రాసిన వారికి ఇవ్వండి అని చెప్పారు. ఇలా అందరూ చేసినప్పుడు వారి వారి బెలూన్ వారి వారి చేతుల్లోనికి వచ్చేస్తాయి అని చెప్పారు. సూపర్ టీచర్ అని పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారంట. ఇతరులకు అవసరమైన దానిని నువ్వు చేస్తే నీకు అవసరమైనది నీకు దొరుకుతుంది అని రోస్ మేరీ టీచర్ నేర్పించిన ఆ మంచి పాఠం ఈరోజు మనకు కూడా ఉపయోగకరంగా ఉంది కదా! మరి రోస్ మేరీ టీచర్ కొరకు థాంక్యూ జీసస్ అని చెబుదామా! వెరీ గుడ్.
ఏంటి పిల్లలు ఇతరులకు సహాయం చేయాలి అని ఆశపడుతున్నారా? యేసయ్య కూడా మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారా పిల్లలు.
- సిస్టర్. దేబోరా
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250