Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.03.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 08-Mar-2023

దిన ధ్యానము(Telugu) 08.03.2023

 

అంశం: స్త్రీకు సాటి స్త్రీయే

 

"గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది" - సామెతలు 31:10

 

నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడైన యెహోవా ఆదామునకు తోడుగా ఒక స్త్రీని సృష్టించారు. తల్లిగా, భార్యగా, కుమార్తెగా, మనవరాలిగా ఇంకా అనేక బంధాలతో దేవుడు మనకిచ్చిన వరమే స్త్రీలు. 

 

దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడిన స్త్రీలు దేశానికి కళ్ళు అని మెచ్చుకొనబడుతున్నారు. ఈనాడు అనేక రంగాలలో స్త్రీలు మెరుగుపడుతూ ఉన్నారు. 

 

మనము ఎంతోమంది విజయములను సాధించిన స్త్రీలను మరియు మిషనరీ స్త్రీలను ఎరిగియున్నాము. పరిశుద్ధ గ్రంథములో అబీగయీలు అనే స్త్రీ గురించి మనకు తెలుసు. అబీగయీలు అనగా సంతోషము అని అర్థం. కానీ ఈయన భర్త అయిన నాబాలు మోటివాడు, దుర్మార్గుడు, కోపిష్టి, త్రాగుబోతు, ధనవంతుడు కూడా. ఈ స్త్రీ మాత్రం బుద్ధిగలది అని మొదటి సమూయేలు 25:3 లో రాయబడినది. కాబట్టి నాబాలుకు వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన సద్గుణవంతురాలిగా ఉన్నది. 

 

బొచ్చు కత్తిరించే రోజున మనుషులకు విందు చేయడము బహుమతులను ఇవ్వడము అలవాటుగా ఉండేది. నాబాలు గొర్రెల బొచ్చులను కత్తిరించుచున్నాడని అరణ్యములో ఉన్న దావీదు విని తన పనివానిలో పదిమందిని పంపించి అతనిని అభినందించి సహాయము అడగమని చెప్పాడు. కానీ నాబాలు తన దుష్ట స్వభావముతో అవమానించి వారిని పంపించేశాడు. దావీదు మిక్కిలి కోపముతో నాబాలును ఎదుర్కొనుటకు నిర్ణయించుకున్నాడు అనే సంగతి విన్న అబీగయీలు తొందరగా బయలుదేరి బహుమతులను తీసుకొని దావీదును మరియు తన మనుషులను కలుసుకొనుటకు వెళ్ళినది. దావీదును చూసి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని క్షమాపణ అడిగినది. దుష్టత్వము ప్రాణ నష్టము ఏర్పడుట మంచిది కాదు అనే విషయాన్ని స్పష్టముగా తెలియజేసింది. అబీగయీలు యొక్క విధేయత మరియు తెలివైన మాటలు దావీదు హృదయాన్ని తాకాయి. ఆశీర్వాదము సమాధానము పొందుకొని వెళ్లిపోయాడు దావీదు. 

 

నాకు ప్రియమైన వారలారా! అబీగయీలు వలె మనము కూడా మన ఇళ్లల్లో, ఉద్యోగస్థలాలలో అందరి మధ్యలో సర్దుకుపోయే మంచి లక్షణముతో దృఢత్వము, నిగ్రహము, విధేయత, భక్తితో కూడిన మంచి మాటలతో దేవునిని మహిమ పరిచి ఆనందంగా జీవిద్దాం. స్త్రీకి సాటి స్త్రీయే. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:

మోక్ష ప్రయాణం మరియు మన పత్రిక పరిచర్యలన్నింటిలో దేవుని హస్తము తోడుండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet