Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.03.2023
Share:

By Village Missionary Movement

Thursday, 02-Mar-2023

దిన ధ్యానము(Telugu) 03.03.2023

 

అంశం: ప్రాణము పెట్టే ప్రేమ

 

"తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు" – యోహాను 15:13

 

1872వ సంవత్సరంలో జన్మించిన జాన్ హార్బర్ తన 13వ యేట ప్రభువును అంగీకరించారు. అతనికి వివాహమైన నాలుగు సంవత్సరములకే తన భార్య మరణించారు. అతనికి నీనా అనే కుమార్తె ఉండేది. దేవుని సేవను చేస్తూ ఉన్న హార్బర్ మోడీ ప్రసంగికుని యొక్క ఆలయమునకు ప్రసంగించుటకు చికాగో నగరానికి పిలవబడ్డారు. అందుకొరకు 1912వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన అతను మరియు అతని కుమార్తె టైటానిక్ షిప్ ఎక్కారు. ఊహించని విధముగా మంచుకొండకు ఢీకొని ఆ షిప్ సముద్రంలో మునిగిపోతున్నప్పుడు అతడు తన కుమార్తెను ప్రాణం కాపాడే సహాయక పడవలో ఎక్కించి ఒక రోజు నేను చూస్తాను అని చెప్పి పంపించేశారు. అతను కూడా వెళ్లడానికి స్థలం ఉన్నప్పటికీ ఆ స్థలంలో వేరే వారిని ఎక్కించారు చివరిగా మరణ భయముతో ఉన్న ప్రజల వద్దకు వచ్చి స్త్రీలు చిన్నపిల్లలు మరియు రక్షణ పొందని వారు మొదటి సహాయక పడవలో ఎక్కండి అని చెబుతూ ఉన్నప్పుడు ఆ ఓడ ఇంకను మునిగిపోతూ ఉంది. ఓడలో ఉన్న ప్రయాణికులు క్రింద ఉన్న ఐస్ వాటర్ లో దూకడం ప్రారంభించారు అందులో హార్బర్ ఒకరు. 

 

ఆ వణుకుతున్న చలిలో కూడా హార్బర్ ఆ చలిలో వారు మరణించడానికి కంటే ముందుగానే వారిని క్రీస్తు చెంతకు నడిపించడం ప్రారంభించారు. అప్పుడు అక్కడ ఒక యవ్వనుడు అక్కడ ఉన్న ఒక చెక్క పైకి ఎక్కి తప్పించుకొనుటకు పోరాడుతూ ఉండుటను హార్బర్ చూశారు. ఆ యవ్వనుడితో నువ్వు రక్షింపబడ్డావా? అని అడిగారు అందుకు తాను లేదు అని జవాబు ఇచ్చాడు. వెంటనే హార్బర్ తను వేసుకున్న లైఫ్ జాకెట్ ను తీసి ఆ యవ్వనుడికి ఇచ్చి నాకంటే ఇది నీకే చాలా అవసరం అని చెప్పి ఆ యవ్వనుడికి సత్యమును బోధించి క్రీస్తు చెంతకు నడిపించారు. పడవలో ఉన్న 1528 మంది లో ఆరుగురు మాత్రమే కాపాడబడ్డారు. అందులో ఆ యవ్వనుడు ఒకరు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ఆరుగురు ఏర్పాటు చేయబడిన సభలో ఆ యవ్వనుడు లేచి నిలబడి తనకు కలిగిన అనుభవమును హార్బర్ తనకు ఎలా ఆ మంచు నీటిలో సువార్త ప్రకటించారో అనేది మరియు అతను ఈత కొట్టలేక బలహీనుడు అగుటను హార్బర్ నీటిలో మునిగే సమయం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచండి అప్పుడు మీరు రక్షింపబడుదురు అని అరిచి చెబుతూ నీటిలో మునిగిపోవుట కన్నీటితో చెప్పాడు. ఈ అద్భుతమైన వ్యక్తి యొక్క క్రియలను హాలీవుడ్ చిత్రంగా తీయకుండా ఉండవచ్చు కానీ అతనికి తప్పకుండా పరలోకంలో సమాధానం లభిస్తుంది. 

 

యేసుక్రీస్తు కూడా మనలను ప్రేమించి తన ప్రాణములను మన కొరకు అర్పించారు దేవుని కుమారుడై ఉన్నప్పటికిని మన కొరకు తన ప్రాణమును ఇచ్చి తన యొక్క నిష్కలంకమైన రక్తమును చిందించి మనకు రక్షణను ఉచితంగా ఇచ్చిన ఆయన ఎల్లప్పుడూ సూపర్ హీరోనే. ఆయన యందు విశ్వాసముంచి ఆయన కొరకు త్యాగం చేసిన ప్రతి ఒక్కరు కూడా హీరోలే. హల్లెలూయ! 

- బ్రదర్. భాగ్య నాథన్ 

 

ప్రార్థన అంశం:-

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆలయ కట్టడ పనులకు అవసరమైన ఆర్థిక సహాయాలు అందేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet