Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.03.2023
Share:

By Village Missionary Movement

Thursday, 02-Mar-2023

దిన ధ్యానము(Telugu) 02.03.2023

 

అంశం: క్రీస్తుకు దాసులం

 

"అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా" - 1 పేతురు 1:19

 

బానిసల వ్యాపారం జరుగుతున్న సమయంలో ఒక ఆంగ్ల వ్యాపారి బానిసలు ఉన్న ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతను ఒక బానిసను చూడడం జరిగింది. ఆ బానిసను గూర్చి తెలుసుకుంటూ ఉన్నప్పుడు తనపై అతనికి దయ ప్రేమ కలిగింది. అతను ఆ బానిస యొక్క ధర కోసం బానిస వ్యాపారిని అడిగినప్పుడు అతని ధర ఆ వ్యాపారి ప్రయాణ ఖర్చు కంటే ఎక్కువ అని చెప్పారు. అయినప్పటికీ అతను ఆ ధర చెల్లించి ఆ బానిసను కొన్నాడు. ఆ బానిస తనకు బానిసగా ఉంచుకోవడానికి నన్ను కొన్నాడు అని పొరపాటుగా భావించి తీవ్ర ఆగ్రహంతో వేదనతో అతనిని శ్రపించాడు కానీ ఆంగ్ల వ్యాపారి చాలా ప్రేమతో కుమారుడా నిన్ను విడిపించడానికి ఎక్కువ ధరకు నిన్ను కొన్నాను అని చెప్పారు. వెంటనే ఆ దాసుడు సంతోషముగా అయ్యా మీరు నా హృదయమును బంధించేశారు అని చెప్పి తన కాళ్లపై పడి కన్నీరు కార్చాడు. 

 

ఈ లెంటు దినాలలో మనలను మనమే పరీక్షించి చూసుకుందాం. మనలను అపవాది, పాపము, శాపము, నరకము వంటి వాటి నుండి విడుదలను ఇవ్వడానికి తన సొంత రక్షమును చిందించి ప్రాణమును అర్పించిన యేసు రక్షకుడి యొక్క పిలుపును ప్రేమను ఎన్నిసార్లు మనం అర్థం చేసుకోకుండా ఉన్నాం. ఇకపై మేము నీకే దాసులమని చెప్పి మనము మన ఆత్మ, శరీరము, ప్రాణములను సమర్పించుకోవడం తప్ప ఇంక ఎలా ఆయన పిలుపును ప్రేమను అంగీకరించగలం? 

 

ఒక బానిస స్వయ సంకల్పముతో ఉండలేడు. యజమానుని చిత్తమే చేయాలి. ఇలా తన స్వార్థం విడిచి శ్రమలను సహించాలి. తన జీవితమంతా తన యజమానినే సేవించాలి. మనము కూడా క్రీస్తుకు దాసులుగా ఆయన మాటకు లోబడి తన చిత్తము చేయడానికి స్వార్ధమును విడిచి పెట్టుటకు శ్రమనుసహించుటకు మన జీవితమంతా ఆయనను సేవించడానికి ఈ లెంట్ దినాల్లో మనలను సమర్పించుకొనడానికి దేవుడు తన కృపను దయచేయును గాక! ఆమెన్. 

- శ్రీమతి. గీత రీఛార్డ్ గారు

 

ప్రార్థన అంశం:

మన పరిచర్య ప్రదేశాలలో దేవుడు తన సంరక్షణను అనుగ్రహించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet