Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.03.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 28-Feb-2023

దిన ధ్యానము(Telugu) 01.03.2023

 

అంశం: పరుగును ఆపవద్దు. 

 

"నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు" - యిర్మియా 12:5

 

హెరాల్డ్ అబ్రహం ఇంగ్లాండు యొక్క గొప్ప పరుగుల వీరుడు. 100 మీటర్ల పరుగు పందెంలో చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. పైగా ప్రతి పోటీలో విజయం సాధించాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఆ రోజుల్లో ఇతనికి పోటీగా ఎరిక్ లిటిల్ అనే పరుగుల వీరుడు ఉండేవాడు. ఎరిక్ 400 మీటర్ల పరుగుల పందెంలో చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. 1924లో పారిస్ లో జరగనున్న ఒలంపిక్స్ కోసం వీరిద్దరూ తీవ్రంగా శిక్షణ పొందారు. ఒలంపిక్స్ లో 100 మీటర్ల పందెంలో హెరాల్డ్ కంటే ఎరిక్ వేగంగా పరిగెత్తి విజయాన్ని సాధించాడు. వెంటనే హెరాల్డ్ కోపంగా ఇకపై పరుగు పందెంలో పాల్గొనను అని నిర్ణయించుకున్నాడు. ఇది చూసిన హెరాల్డ్ స్నేహితుడు ఒకడు తనను ధైర్యపరచి మాట్లాడాలి అని ప్రయత్నించాడు కానీ హెరాల్డ్ కోపంగా జయించడానికి నేను పరిగెత్తుతున్నాను కానీ విజయం సాధించకపోతే ఇకపై ఎప్పుడు పరిగెత్తను అని చెప్పాడు. హెరాల్డ్ స్నేహితుడు తనను చూసి తెలివిగా నువ్వు పరిగెత్తకపోతే ఇంకెప్పటికీ గెలువ లేవు అని అన్నాడు. ఈ మాటలో ఉన్న అర్థమును తెలుసుకున్న హెరాల్డ్ గ్రహింపును పొందుకున్నాడు. 

 

పోటీలతో నిండుకున్న లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన అపజయల సమయంలో మనం బలహీనమైపోతున్నాం. హెరాల్డ్ వలే నేను ఇంకా ఇంతే అని హీనమైన స్థితికి దిగజారి పోతున్నాం కానీ ఇది సరైన విధానం కాదు. మనం ఒక అపజయాన్ని ఎదుర్కొన్నట్లయితే దాని నుండి మరలా ఎలా బయటకు రావాలి? ఇందులో నేను ఏం నేర్చుకోవాలి? అని కొంచెం నిదానంగా ఆలోచించడం అవసరం. 

 

క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ పరుగులో అలసిపోకుండా పరిగెత్తాలి అని దేవుడు మనలను ప్రోత్సహిస్తున్నారు. ఏలియ వలె ఇంత మట్టుకు చాలును అని చెప్పే పరిస్థితులు మన చుట్టూ ఉండవచ్చు కానీ దేవుడు మనలను చూసి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది నీవు లెమ్ము అని అంటున్నారు. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపకనీయకుడి అని పౌలు మనలను హెచ్చరిస్తున్నారు. మనలను చూసి దేవుడు ఇలా అంటున్నారు విశ్వాసముతో పందెమును మొదలు పెట్టండి అని. పౌలు నేను వృధాగా పరిగెత్తాను వృధాగా ప్రయాసపడ్డాను అనే ఆలోచన లేకుండా క్రీస్తు రాకడలో మనకు సంతోషం కలుగుతుంది. ఆమెన్! 

- బ్రదర్. పి। జాకబ్ శంకర్ గారు. 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరిగే పరిచర్యలో దేవుని హస్తం తోడుండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al