Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.02.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 26-Feb-2023

దిన ధ్యానము(Telugu) 26.02.2023 (Kids Special)

 

అంశం: రీనా మరియు గొర్రె పిల్ల

 

కంటత వాక్యం:

 

"నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" - కీర్తనలు 119: 71

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

హలో పిల్లలు మీరు ఏఏ జంతువులను ఏఏ వస్తువులను ప్రేమిస్తున్నారు? కొంతమందికి పిల్లి, కొంతమందికి కుక్కపిల్ల ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కానీ ఈ కథలో ఉన్న రీనాకు ఏది ఇష్టమో చూద్దామా! 

 

రీనా బాగా చదువుకున్న దేవునికి భయపడే పిల్ల. ప్రార్థించకుండా ఏమి చెయ్యదు. తల్లిదండ్రులకు బయపడుతుంది. తన తల్లిదండ్రులు ఒక గొర్రె పిల్లనుకొని ఇంటిలో పెంచుతూ ఉన్నారు. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు, పడుకున్నప్పుడు కూడా రీనా ఆ గొర్రె పిల్లను తన పక్కనే ఉంచుకుంటుంది. గొర్రె పిల్ల పై ఉన్న ప్రేమ వలన ప్రార్ధన చేయడం, బైబిల్ చదవడం కొంచెం కొంచెం గా తగ్గిస్తూ వస్తుంది. తల్లిదండ్రులు ఎంత తిట్టినా వినలేదు రోజులు గడిచాయి. రీనా కూడా పెరిగి పెద్దదై కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది గొర్రెపిల్ల కూడా పెరిగి పెద్దదయింది. 

 

ఒకరోజు కాలేజీ నుండి వచ్చిన రీనా బ్యాగ్ ని పక్కన పెట్టి గొర్రెను తీసుకొని పొలానికి వెళ్ళింది. అక్కడ ఎక్కువ గొర్రెలు ఉండటం వలన రీనా పట్టుకుని ఉన్న గొర్రె తాడు లాక్కుని పరిగెత్తింది. రీనా కింద పడిపోయింది. ఈ గొర్రె ఆ గొర్రెల మందులోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న కాపరి దాన్ని తరిమి వేశాడు. ఆ గొర్రె ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ రీనా కనిపించలేదు. పొలానికి వెళ్లి చూసినప్పుడు చెయ్యి విరిగి లేవలేని స్థితిలో ఉంది రీనా. తన తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకువచ్చి చేతికి కట్టు వేశారు. నొప్పితో మంచం పై పడుకొని ఆలోచించడం మొదలు పెట్టింది. నేను ఆ గొర్రె పిల్ల లేకముందు యేసయ్యతో ఎంత దగ్గరగా ఉండేదాన్ని ఇప్పుడు ఈ గొర్రె నన్ను నా యేసే దగ్గరను నన్ను దూరం చేసింది. ఈ రోజు నా చెయ్యి విరిగి ఉండకపోతే నేను ఇంకా యేసయ్యకు దూరంగా వెళ్లిపోయే దానిని. యేసయ్య నన్ను ప్రేమించడం వలననే నాకు మంచి పాటన్ని నేర్పించారు. ఇకపై యేసయ్య కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించను అని తన మనసులో నిర్ణయించుకుంది. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీరు కూడా ఈ రీనా వలె యేసయ్య నుండి దూరముగా వెళ్లిపోయారా? అయితే ఇది యేసయ్యకు నచ్చదు ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ రీనా వలె మరలా యేసయ్య చెంతకు పరిగెత్తుకొని రండి లేదంటే దెబ్బలు తగులుతాయి. ఓకేనా! 

 

సహోదరి.ఎస్. సారా సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet