Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.02.2023
Share:

By Village Missionary Movement

Saturday, 25-Feb-2023

దిన ధ్యానము(Telugu) 25.02.2023

 

అంశం: అబద్ధం వల్ల కలిగే శిక్ష

 

 "నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను" - అపో.కార్యములు 5:4

 

ఒక మిషనరీ సేవ చేయడానికి ఉత్తర భారతదేశానికి వచ్చారు. అతడు పేదవారికి అత్యవసర సహాయమును చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఇతనితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవాలి అనుకున్నారు. ఆ మిషనరీ వచ్చే దారిలో ఒకరిని చనిపోయినట్లు నటించమని చెప్పారు. ఇతను ఒక అనాధ ఇతనిని పాతి పెట్టుటకు డబ్బులు లేవు అని ఆ మిషనరీతో చెప్పారు. ఆ మిషనరీ డబ్బులు ఇచ్చి ప్రభువా ఇతని ఆత్మ శాంతించును గాక అని ప్రార్థన చేసి ఇతని పాతి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మిషనరీ వెళ్ళిపోయిన వెంటనే చనిపోయినట్లుగా నటించిన అతనిని లేపారు అతను లేవలేదు. అతను నిజముగానే చనిపోయాడు. ఆ మిషనరీ ప్రార్థించిన విధముగానే అతని ఆత్మ శాంతించింది. నిజాయితీగల దైవ మనుష్యుని వద్ద చెప్పిన ఒక అబద్ధం వలన కలిగే శిక్షణ చూసారా? 

 

ఇదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో అననీయ సప్పీరా అను ఇద్దరు మనుషులు కలరు. అననీయ పొలమును అమ్మి అందులో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద కొంత పెట్టాడు. అప్పుడు పేతురు అననీయ మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? ఎందుకు ఈ సంగతి మీ హృదయం లో ఉద్దేశించు కొన్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని అడిగారు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణమును విడిచాడు. తన భార్య అయిన సప్పీరాను కూడా ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? అని అడిగినప్పుడు అవును ఇంతకీ అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి అని అన్నాడు. వెంటనే ఆమె కూడా పడి ప్రాణం విడిచింది. 

 

మనలను నశింపజేయాలి అని కాదు ఆశీర్వదింప చేయాలి అనే దేవుడు ఆశపడుతున్నారు. కానీ మనం దైవ మనుషులతో ధైర్యముగా అబద్దం చెప్పడం అనేది దేవునికి విరోధముగా అబద్ధము చెప్పడం అనే దానితో సమానం. మనం దేవునితో మరియు మనుషులతో నిజముగా మాట్లాడుదాం. మనకు కలిగే శిక్షలు నుండి తప్పించుకుందాం. దేవుడు మనలని ఆశీర్వదించును గాక ఆమెన్.

- బ్రదర్.రూబెన్ క్రిష్టి

 

ప్రార్థన అంశం:

మన సేవా స్థలాలలో ద్విచక్ర వాహనములు అవసరమై ఉన్నవి.సహాయం చేసే హృదయాలు లేచులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet