Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.02.2023
Share:

By Village Missionary Movement

Friday, 24-Feb-2023

దిన ధ్యానము(Telugu) 24.02.2023

 

అంశం: చేయి విడవని తండ్రి

 

"ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా" - ఆదికాండము 28: 15

 

నా పేరు భాను. నేను బైబిల్ కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుతూ ఉన్నాను. ఒక రోజు ఫోన్లో మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రెండు వారాలు అయినప్పటికీ నా కాళ్ళపై తగిలిన గాయము తగ్గడం లేదు. షుగర్ ఉండడం వలన ఆ గాయం పెద్దదవుతుంది చీము కారుతుంది రేపు హాస్పిటల్ కి వెళ్లి చూపించాలి. చాలా భయంగా ఉంది అని చెప్పారు అమ్మ. నేను చాలా భారముతో కన్నీటితో దేవుని సన్నిధానంలో ప్రభువా నేను నీ మాటకు లోబడి నీ సేవను చేయుటకు వచ్చాను. నేను మా అమ్మ దగ్గర ఉండి ఆమెను చూసుకోలేను. అక్కడ నా స్థానంలో మీరు పెద్ద కుమారుడు వలె అన్నింటిని చూసుకోండి అని ప్రార్థించి పడుకున్నాను. మరుసటి రోజు నేను మా అమ్మతో మాట్లాడినప్పుడు రాత్రి ఉన్న గాయము ఉదయము చూసేసరికి తగ్గిపోయింది అని ఆశ్చర్యంగా అమ్మ చెప్పారు. వెంటనే నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపాను. 

 

పరిశుద్ధ గ్రంథములో మనము అబ్రహామును గూర్చి చదువుతున్నాం. అతను యెహోవాకు లోబడి తన సొంత దేశం విడిచి జాతిని వృత్తిని విడిచి యెహోవా సెలవిచ్చిన దేశమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశారు. తాను చెప్పినట్లే అన్ని కార్యాలలో చక్కగా జరిగించి అతనిని ఆశీర్వదించారు దేవుడు. ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రహాముతో చెప్పినప్పుడు ప్రశ్నించకుండా అబ్రహాము లోబడ్డాడు. కానీ ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు ఆ స్థలములో బలయింది. అది వేరే ఏమీ కాదు మన కొరకు బలి అయినా గొర్రెపిల్ల అయినా యేసు క్రీస్తు ప్రభువును సూచిస్తుంది. అబ్రహాము దేవునికి లోబడుట వలన దేవుడు అతనితో కూడా ఉండి అతనిని మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. మనం అబ్రహామును విశ్వాసులు తండ్రి అని పిలుస్తున్నాము. 

 

అవును ప్రియమైన వారలారా! మనము మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మన జీవితంలో మేలులను చేస్తారు. దేవుని కొరకు ఏదైనా ఒక దానిని ప్రయాసపడి చేసినప్పుడు, ఆయన మాటలకు లోబడినప్పుడు ఆయన మీ చేయి విడువని తండ్రి అయి ఉన్నారు. ఆయన మీతో చెప్పినది నెరవేర్చు వరకు మిమ్మల్ని విడువరు. మీ కొరకు ఆయన సమస్తమును చేసి ముగిస్తారు. ఆయన చిత్త ప్రకారంగా జీవించుటకు సమర్పించుకున్న మీ జీవితంలో ఇంతవరకు మీరు చూడని అద్భుతములను చేసే శక్తివంతుడై ఉన్నాడు. 

- సిస్టర్. ఎం హేప్సిబా

 

ప్రార్థనా అంశం:

మనం పంపిస్తున్న ప్రార్థనా అంశముల కొరకు బ్రతిమాలి ప్రార్థించే ఎస్తేరు వంటి అనేకమంది స్త్రీలు లేచు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet