Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.02.2023
Share:

By Village Missionary Movement

Thursday, 23-Feb-2023

దిన ధ్యానము(Telugu) 23.02.2023

 

అంశం: రెల్లు

 

"తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" - 1 కోరింథీయులకు 10:12

 

నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దాని దగ్గర రెల్లు మొక్కలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ చెట్టు కొమ్మలతో కూడిన పెద్ద చెట్టు. తన కొమ్మలను చూస్తే దానికి చాలా గర్వంగా ఉంటుంది. పక్కన ఉన్న రెల్లును చిన్నచూపు చూసేది. ఆ రెల్లును చూసి చిన్న గాలి వేస్తే చాలు అటు ఇటు వంగిపోయే మీకు నా పక్కన ఉండే అర్హత లేదు అని హేళనగా మాట్లాడుతూ ఉండేది. ఒక రోజు పెద్ద గాలులతో భారీ వర్షం కురవడం మొదలైంది. ఆ చెట్టు రెల్లును చూసి ఈ వర్షంలో నీ పూర్తిగా పడిపోతావు అని చెప్పి హేళన చేసింది. తుఫాను వలె పెద్ద గాలి వీయడం ప్రారంభించింది ఆ చెట్టు వేర్లతో సహా నేలకూలింది. ఆ తుఫాను నిమ్మలించిన తర్వాత నేనే ఇలా పడిపోయాను అంటే ఈ రెల్లు అస్సలు ఉండదేమో అని చెప్పి చూసింది కానీ రెల్లు ఎప్పటిలా అటూ ఇటూ ఊగుతూ ఉన్నది. ఆ చెట్టు నీకు ఏమీ అవ్వలేదా అని ఆశ్చర్యంగా అడిగింది. గాలి వీఛినప్పుడు నేను దాని దిశానుగుణముగా ఒంగిపోయాను నా పైనుండి గాలివీస్తూ వెళ్ళిపోయింది. అది నన్ను చూడలేదు అని చెప్పాయి రెల్లు మొక్కలు. తనను తగ్గించుకొనడం ఎరిగిన రెల్లు తమ్మును తాము కాపాడుకోగలిగాయి గర్వముగా మాట్లాడిన చెట్టు నశించింది. 

 

పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొలియాతును చూసి చేతిలో ఒడిసెలను పట్టుకుని వస్తున్నాడు. గొలియాతు శరీరంపై మరియు చేతులపైన అనేక సంరక్షణ ఆయుధాలు ఉన్నాయి కానీ దావీదు చేతిలో నున్నని గులకరాళ్లు మాత్రమే ఉన్నాయి. దావీదు రాయిని విసిరినప్పుడు గొలియాతు తన చేతిలో ఉన్న డాలు తో అడ్డుకోవచ్చు కానీ ఈ రాయి నన్ను ఏమి చేయదులే అని గర్వముగా నిలబడ్డాడు. ఆ రాయే గొలియాతును పడగొట్టింది. అవును గర్వమే తాను కూలిపోవడానికి కారణమైంది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా! మీరు ఉంటున్న స్థలములో మఱ్ఱి చెట్టు వంటి వారు ఉండవచ్చు కానీ రెల్లు వంటి వారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా హెచ్చరింపబడుతున్నాం. నేను ఎవరో తెలుసా? నా ఉద్యోగం, నా జీవితం, నా ఇల్లు, ఇది నా కష్టం,,ఇది నా నైపుణ్యం, నా బలం అనుకుంటూ ఉంటే ఈ గర్వం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నవారిని చిన్న చూపు చూడడం మొదలు పెట్టేస్తాం. ఇలాంటి ఆలోచన రావడం అనేది పడిపోవుటకు ప్రారంభం. దీనిని గూర్చి సామెతలు 18: 12 లో ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయం ఉండును అని మనము చదువుతున్నాం. గర్వం తో జీవించకుండా మనలను మనమే తగ్గించుకోవడం నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. 

 

ప్రార్థన:

ప్రేమ గల ప్రభువా నేను ఈ గోలియాతు వలె ఎవరిని అల్పముగా చూచి పడిపోకుండా జాగ్రత్తగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet