Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.02.2023
Share:

By Village Missionary Movement

Monday, 20-Feb-2023

దిన ధ్యానము(Telugu) 20.02.2023

 

అంశం: మీరు యోగ్యుల? 

 

"వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు" - లూకా 7:4

 

ఒకరోజు ఒక సేవకుని యొక్క స్నేహితుడు తన యొద్దకు వచ్చి నా భార్యకు ఆపరేషన్ జరిగింది. తరువాత చలి జ్వరం వచ్చింది ఆమె మరణముతో పోరాడుతుంది అని ఏడుస్తూ చెప్పాడు. సేవకుడు ఆ సహోదరి కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహోదరి చేసిన అనేక మంచి పనులు జ్ఞాపకము చేశాడు. అనేక మంది సేవకులకు ఆమె ఆహారం ఇచ్చి సహాయం చేసింది. ఈ సేవకుడు కూడా సువార్త ప్రకటిస్తూ ఆ స్థలానికి మూడుసార్లు వెళ్ళినప్పుడు ఆ సహోదరీ ఆహారం ఇచ్చింది. ప్రభువా మీరు దయ చూపుటకు ఈ సహోదరి అర్హత కలిగినది అని చెప్పి ఆ ప్రాణము కొరకు పోరాడి ప్రార్థించాడు ఆ సేవకుడు. దేవుడు ఆ సేవకుని యొక్క ప్రార్థన విని ఆ సహోదరిని స్వస్థపరిచారు. 

 

శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు ఒకరు రోగి అయి చావ సిద్ధమైయుండెను. యేసును గూర్చి విన్న శతాధిపతి యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపించి ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచ వలెనని ఆయనను వేడుకొనమన్నాడు. ఆ పెద్దలు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మన కొరకు సమాజ మందిరము కట్టించాడు అని చెప్పి మిక్కిలి బ్రతిమాలుకున్నారు. ఈ మాటలు విన్న యేసు శతాధిపతి ఇంటికి వెళ్లారు. తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన వద్దకు వెళ్లి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను అని ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రమే సెలవు ఇమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పమని వారిని పంపాడు. పంపబడిన స్నేహితులు తిరిగి వెళ్ళినప్పుడు ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. 

 

ప్రియమైన వారులారా! మన క్రియల ద్వారా మనము పరలోకమునకు వెళ్లలేము కానీ మన యొక్క ప్రేమ కార్యాలకు పరలోకములో ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. కొర్నేలీ చేసిన దానధర్మాలు దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొనబడ్డాయి. తభిత యొక్క సత్క్రియలు ఆమెను ప్రాణముతో లేపుటకు కారణమయ్యాయి. కొన్ని కార్యాలు దేవుని యొద్ద నుండి దయను అద్భుతములను పొందుకొనుటకు కారణం అవుతాయి. మనము కూడా మేలులను పొందుకొనుటకు యోగ్యులై జీవిద్దాం. నీ శక్తి కొలది చేసే పనులన్నింటికి ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని ఎన్నడు మర్చిపోవద్దు. అలయక మేలులను చేయుడి. 

- శ్రీమతి. బ్యులా గారు 

 

ప్రార్థన అంశం:

మన మీడియా పరిచర్యకు కావలసిన వస్తువులను కొనుటకు మరియు అవసరతలు సంధింపబడుటకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al