Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.02.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 19-Feb-2023

దిన ధ్యానము(Telugu) 19.02.2023 (Kids Special)

 

అంశం: పులి పిల్ల

 

“పాపము చేయువాడే మరణము నొందును” - యెహేజ్కేలు 18: 20

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

అడవిలో వేటాడుటకు ఒక వేటగాడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. వేటాడుతున్నప్పుడు ఒక చిన్న పులి పిల్లను చూసాడు. అది పులి పిల్ల అని తెలియకపోవడంతో అడవి పిల్లి అనుకొని దానిని ఆశగా ఇంటికి తీసుకుని వచ్చి పెంచడం మొదలుపెట్టాడు. అది ఇంట్లో ఉన్న కుక్క పిల్లతో అదే విధముగా తన కుమారులైన కరణ్ మరియు చరణలతో చక్కగా ఆడుకుంటూ ఉండేది. స్కూల్ నుండి వచ్చిన వెంటనే కుక్కపిల్లతో మరియు పులి పిల్లతో ఆడుకోవడము కరణ్ కు చాలా జాలిగా అనిపించేది. చరణ్ తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. కొన్ని నెలల్లో పులిపిల్ల పెరగడంతో దానిలోని తేడాలను మార్పులను చూశారు. ఇది పులి అని తెలిసినప్పటికీ విడిచి పెట్టే మనసు వారికి లేదు.

 

పక్కింట్లో ఉన్న అందరూ ఆ పులిని చూసి భయపడి దీనిని అడవికి తీసుకుని వెళ్లి వదిలేయండి లేదంటే ఏదో ఒక రోజు మనలను నాశనం చేస్తుంది అని చెప్పినప్పుడు వేటగానికి అలా చేయడం చాలా కష్టం అనిపించింది. దీనిని నా బిడ్డ వలె పెంచాను ఇది మనలను ఏమి చేయదు అని చెప్తూ వచ్చాడు. ఒకరోజు కరణ్ బయట ఆడుకుంటూ ఉన్నప్పుడు క్రిందపడి కాళ్లపై గాయం తగిలి రక్తం కారడం మొదలైంది. ఆ పులి త్వరగా వచ్చి ఆ గాయముపై కారుతున్న రక్తాన్ని ప్రేమగా నాకుతూ ఉంది. నేనంటే ఈ పులికి ఎంత ఇష్టమో అని కరణ్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు రక్తమును రుచిచూచిన పులికి దాని లోపట ఉన్న జన్మ స్వభావము బయటకు రావడము మొదలైంది. ఒకే ఒక పంజా దెబ్బకు కరణ్ ను కొట్టి చంపేసింది పులి. ప్రేమగా పెంచిన పులి పిల్ల ఇది అని వేటగాడు పరిగెత్తుకుని వచ్చాడు. అతనిని కూడా ఆ పులి గాయపరిచింది. పక్కింటి స్నేహితులు చెప్పిన మాటలు వినకుండా పోయాను పులి పిల్ల కావాలి అనుకుని నా కుమారుని కోల్పోయాను అని చాలా బాధపడ్డాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి ఆ పులిని వారికి అప్పగించిన తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. 

 

ఏంటి పిల్లలు ఈ పులి కదా చాలా బాధతో ముగిసింది కదా. పాపముతో ఆడుకుంటే మన జీవితము కూడా ఇలానే నశించిపోతుంది. చిన్న అబద్ధం, దొంగతనం, అసూయ, సెల్ఫోన్ చూడడం వంటి పాపములను జయించాలి అంటే చిన్నవయసులోనే యేసయ్య దగ్గర కృపను అడగాలి. ఓకేనా పిల్లలు! 

- శ్రీమతి. జీవ విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al