By Village Missionary Movement
Saturday, 18-Feb-2023దిన ధ్యానము(Telugu) 18.02.2023
అంశం:- నిలిచి యుండుడి
"ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము" - హెబ్రీయులకు 3:15
ఒక యవ్వనుడు ఒక బోధకుడ్ని కలవడానికి కన్నీటితో వచ్చాడు. బోధకుడా ఈనెల అయినా నేను ఆశీర్వాదకరంగా ఉండు లాగున ప్రార్థించండి అన్నాడు. వెంటనే బోధకుడు ఎందుకు నీ జీవితంలో ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు యవ్వనుడు నేను గత నెలలో కొత్తగా వ్యాపారమును ప్రారంభించాను పెద్దగా ఏమీ లాభము లేదు అందుకే వేరే వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను అందుకొరకు ప్రార్థన చేయాలి అని వచ్చాను అని అన్నాడు. వెంటనే బోధకుడు నవ్వుతూ తమ్ముడు అల్పముగా ఉన్న ప్రారంభం యొక్క ముగింపును సంపూర్ణంగా మార్చే శక్తిమంతుడు మన దేవుడు దానికి స్థిరమైన మనసు కావాలి ఇదే వ్యాపారంలో నిలిచి ఉండుము దేవుడు జ్ఞానమును ఇస్తారు అని ప్రార్థించి పంపించారు.
అవును దేవుని పిల్లలారా! మనము కూడా ఈ ఏడాదిలో కొత్త కొత్త కార్యక్రమాల్లో పాల్గొని ఉంటాం. కానీ అందులో చిన్న తడబాటు మోసం కలిగిన సరే ఇదంతా మనకు సరైనది కాదు దీనిని చేయడం చాలా కష్టం అని చెప్పి వెనుదురుగకుండా ఆ కార్యక్రమమునకు ముగింపు పెట్టకుండా క్రమముగా చేసినట్లయితే దాని ఫలితమును పరిపూర్ణముగా మనము పొందుకుంటాము. అందువలన దావీదు దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయుము అని కీర్తనలు 51:10 లో చెప్తున్నాడు ప్రారంభంలో కొన్ని తడబాట్లు మోసములు ఉన్నప్పటికీ మనము విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు మనము క్రీస్తులో పాలివారముగా మారగలము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు కానానులోనికి వెళ్తాం అని నమ్మకముతో వెళ్లారు. కానీ ఎర్ర సముద్రమును, త్రాగుటకు నీరు, ఆహారము అని అనేక సమస్యలను చూసి నమ్మకమును విడిచిపెట్టి సనుగు కొన్నారు. అందుకే వారు కానానును కోల్పోయారు. మీరు మీ యొక్క ఆత్మీయ మరియు లోక జీవితం యొక్క పురోగతి కోసం మీరు తీసుకు నిర్ణయంలో వెనుదురుగకుండా వదలకుండా ముందుకు సాగండి.
మీరు మొదలు పెట్టిన కార్యాలలో చిన్న లోపం సంభవించినందుకు దానిని అంగీకరించలేక విడిచి పెట్టాలి అని నిర్ణయించుకుంటున్నారా? మీయొక్క ప్రారంభం స్వల్పముగా ఉన్న మీ యొక్క ముగింపు సంపూర్ణంగా ఉంటుంది. మీరు నూతనముగా ప్రారంభించిన పని లేక వ్యాపారము ప్రారంభంలో మంచిగా సమస్య లేకుండా సాగుతున్నట్లయితే అందులో జాగ్రత్త అవసరం ఎందుకనగా మొదట బహు త్వరగా దొరికిన స్వాశ్యము తుదకు దీవెన నొందకపోవును అని సామెతలు 20:21 లో రాయబడి ఉన్నది దేవుని వద్ద నుండి సంపూర్ణ మేలులు పొందుకొనుటకు స్థిరమైన మనసును కలిగి ఉందాం. హల్లెలూయ!
- శ్రీమతి. Anbhu జోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:
స్వస్థత నిచ్చు ఆరాధనలో ప్రార్థన అవసరతలు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ మరియు శరీర విడుదల పొందుకొను లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250