Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.02.2023
Share:

By Village Missionary Movement

Friday, 17-Feb-2023

దిన ధ్యానము(Telugu) 17.02.2023

 

అంశం:- అపారమైన వానపాము

 

"కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము" - రోమీయులకు 12:21

 

ఇద్దరు చిన్న పిల్లలు సెలవుల్లో మట్టితో ఆడుకుంటూ ఉన్నారు. వారి చేతికి ఒక వానపాము చిక్కింది. దానిని నాలుగు ముక్కలుగా చేసి అక్కడ పడేసి వేరే చోటికి ఆడుకోవడానికి వెళ్లిపోయారు. ఆ వానపాము నొప్పితో కొట్టుమిట్టాడింది. కొన్ని రోజుల్లో నాలుగు ముక్కలు చేయబడిన వానపాము నాలుగు వానపాములుగా రూపాంతరము చెంది నేల ఎండిపోకుండా భూమిపైన నీటిని భూమి లోపలికి వెళ్ళుటకు, మొక్కలు పెరుగుటకు చాలా ఉపయోగకరంగా మారింది. ముక్కలు చేయబడిన స్థితిలో బయటకు కనబడకుండా భూమిలో ఉన్నప్పటికీ ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నా ఈ వానపాము యొక్క జీవితం మిక్కిలి ఆశ్చర్యకరమైనది. తనకు కీడు చేసినప్పటికీ అది ఇతరులకు మేలు చేసి ఉపయోగకరముగా మారినది.

 

పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథములో సిరియా రాజు తన రధములతో, సైన్యముతో ఇశ్రాయేలీయులకు విరోధముగా యుద్ధము చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయుల రాజు వారికి విరోధముగా నిలబడకుండా వారికి విస్తారమైన భోజన పదార్థములను ఇచ్చి విందును జరిగించి వారిని పంపిన ఒక చర్య సమాధానపరచు వారు ధన్యులు అనే వాక్యమును జ్ఞాపకం చేస్తున్నది కదా. అప్పటినుండి సిరియా దండువారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి వచ్చుట మానిపోయెను అని చదువుతున్నాం. తమకు విరోధముగా వచ్చిన వారికి విందు ఏర్పాటు చేసిన సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. ఇదే విధముగా యోసేపు కూడా తనను బానిసగా అమ్మివేసిన తన సహోదరులను శిక్షించకుండా వారి కొరకు త్యాగం చేశాడు. తనను రాళ్లతో కొట్టిన వారిని క్షమించి ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకము అని స్టెఫను ప్రార్థించాడు. కొత్త నిబంధన గ్రంధంలో నీతిమంతుడైన యోసేపు మరియను అవమానపరచాలి అని అనుకొనలేదు. క్రీస్తు మనస్సు యోసేపులో ఉన్నట్టే మనలో కూడా అభివృద్ధి చెందనిద్దాం.

 

అవును వానపాము వలె మన యొక్క క్రియలు ఇతరులను ఆలోచింపజేయనిద్దాం. మనకు విరోధముగా లేచిన వారిని ప్రేమించే మనస్సు మనకు అవసరం. యోసేపు వంటి సహోదర ప్రేమ మనలో అభివృద్ధి చేసుకుందాం. స్తెఫనవలే శ్రమల మధ్యలో ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవమును అభివృద్ధి చేసుకుందాం. యోసేపు వలె ఇతరులను అవమానపరచక యేసయ్య మనసు మన అందరిలో ఉండనిద్దాం. దేవుడు మనలను ఆశీర్వదించును గాక! ఆమెన్.

- శ్రీమతి. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

ప్రతి సోమవారం రాత్రి జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేకులు పాలు పొందుకొనులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al