Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.02.2023
Share:

By Village Missionary Movement

Thursday, 16-Feb-2023

దిన ధ్యానము(Telugu) 16.02.2023

 

అంశం:- ఆయన చిత్తం ఏమిటి? 

 

"మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము" - 1 యోహాను 5:14

 

నేటి యుగంలో ఎవరు ఎవరిపైనా ఆధారపడి జీవించకూడదు అనే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఆధారపడి జీవించే జీవితం బోర్ కొట్టేసింది. ఆ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలకు లోబడి జీవించేవారు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆశలు యవ్వన పిల్లలకు ద్వేషముల కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల సలహాలను వినలేక సతమతమవుతున్నారుఈనాటి యువతరం. ఇందులో దేవుని చిత్తానికి ఎలా చెవి ఒగ్గుతారు అనేది ఆలోచించాల్సిన విషయమే. మనం దేవున్నీ ఏ స్థానంలో ఉంచియున్నాము? నీ సొంత కోరికల కొరకు మీకు కావలసిన వాటిని మొదటి స్థానంలో ఉంచారా? అలా ఉంచినట్లయితే మీ అంత అన్ లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. ప్రభువైన యేసు క్రీస్తునకు మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత మిగతా కార్యములకు స్థానం ఇచ్చినప్పుడు మనం అడగని ఆశీర్వాదములను దేవుడు మనకు ఇచ్చుటకు శక్తిమంతులై ఉన్నారు. 

 

పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రభు యొక్క చిత్తమును చేసి జీవించి చూపించిన వ్యక్తులు గలరు. వారిలో సొలోమోను గూర్చిన కొన్ని విషయాలు మీకు చూపించాలి అని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మూడవ రాజు ఇతనే. ఏడు సంవత్సరాలలో దేవుని మందిరాన్ని కట్టాడు. ప్రసంగి, పరమగీతము, సామెతలు వంటి పుస్తకాలను రాశాడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు సమాధానముతో పరిపాలించాడు. అనేక విధాలైన ప్రతిభలు, సామర్థ్యాలు కలిగిన సొలోమోను తనకు ఇష్టమైన ప్రార్థన చేయకుండా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. అతను స్వార్ధపరుడు వలె ఉండలేదు. 1కోరింది 10: 24 లో చెప్పబడిన విధంగా దేవుని రాజ్యము కొరకు ప్రజలను సేకరించుట కొరకు తన యొక్క ప్రయోజనము పైన దృష్టి పెట్టకుండా ఇతరుల ప్రయోజనం పైన దృష్టి పెట్టాడు సొలోమోను. ఇతని యొక్క హృదయాన్ని చూసిన దేవుడు ఇతను అడిగిన జ్ఞానమును మాత్రమే కాదు అడగని ఐశ్వర్యమును కూడా దేవుడు ఇచ్చారు. 

 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరీ సహోదరులారా! జీవితంలో మీ యొక్క కార్యముల కొరకు దేవునితో పోరాడుతూ ఉన్నారా? మీ కొరకే బ్రతిమాలి మాట్లాడుతూ ఉన్నారా? అయితే కచ్చితంగా మారాల్సింది మీ ప్రార్థనే. దేవుని చిత్తానుసారముగా మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీ మనవి ఆలకించును. దేవుని చిత్తుప్రకారముగా మీ జీవితం సాగుతుంది అనుటలో సందేహమే లేదు. 

- సిస్టర్. హేమలత గారు

 

ప్రార్థన అంశం:-

మే 1వ తేదీ తమిళనాడులో గల తిరుచిలో జరుగునున్న రివైవల్ యూత్ మీటింగ్ సిద్ధపాటు పనులలో దేవుని హస్తము తోడైయుండురాలను ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al