By Village Missionary Movement
Wednesday, 15-Feb-2023దిన ధ్యానము(Telugu) 15.02.2023
అంశం:- నూతన ఆరంభం
"కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు" - యెషయా 41:15
నేను ఉన్న గ్రామంలో ఒక ప్రేమగల మంచి కుటుంబం నివసిస్తూ వచ్చింది. ఆ కుటుంబ యజమాని షేర్ మార్కెట్ బిజినెస్ ద్వారా మంచి లాభాన్ని పొందుకొని సంతోషంగా జీవిస్తున్న పరిస్థితుల్లో ఒకరోజు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన బిజినెస్ పార్ట్నర్ చాలా లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు అని ఆ కాల్ లో చెప్పబడింది. జీవితంలో ఆస్తి, అంతస్తు అన్నింటిని కోల్పోయి అవమానం, అపజయం, మోసాల్లో జీవితాన్ని కోల్పోయాం అంత అయిపోయింది అనే స్థితికి దిగజార్చబడ్డారు. అలసి, సొలసి, కృంగి ఉన్న పరిస్థితులలో దేవుని మాటకు లోబడి ఆయన సేవ కొరకు తనను సమర్పించుకోవడం వలన దేవుడు ఆ సహోదరుడి జీవితంలో నూతన ఆరంభమును దయచేసి ఈనాడు పరిచర్యలో అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడి కోల్పోయిన సంతోషమును సమాధానమును తిరిగి ఇచ్చి దేవుడు తనకు సహాయం చేశారు.
ఇటువంటి ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడైన సీమోను పేతురు యొక్క జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఈ సీమోను పేతురు ఒకరు. సీమోను అనగా వినేవాడు లేదా చెవి ఒగ్గు వాడు అని అర్థం. పేతురు అనగా రాయి అని అర్థం. సీమోను పేతురు చేపలు పట్టే జాలరి. గలిలియా సముద్రం అతనికి కొత్త కాదు. సముద్రంలో చేపలు పట్టడం అనేది తన ప్రతిభ. ఒకరోజు రాత్రంతా సముద్రంలో వలవేసినా ఒక్క చేప కూడా దొరకలేదు అనేది పేతురు తన జీవితంలో ఎదుర్కొన్న మొదటి అపజయం. యేసుని అంగీకరించి ఆయనతో నడిచిన తర్వాత ఆయనను తిరస్కరించి తన జీవితంలో చూసిన పెద్ద అపజయం అది. ఇకపై జీవితంలో ఏమీ లేదు అంతా అయిపోయింది అని కృంగి ఉన్న పేతురును వెతుక్కుంటూ మరలా దేవుని పిలుపు వస్తుంది. వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనే దేవుని స్వరం పేతురు జీవితంలో ఒక నూతన ఆరంభమున కలుగజేసింది. పేతురు జీవితంలో విశ్వాసం చిగురించేలా చేసింది. మరలా దేవుని కొరకు తనను ఉజ్జీవముగా పరిగెత్తు లాగున చేసింది, సంఘస్తంభముగా మార్చింది.
దీనిని చదువుతున్న స్నేహితులారా! ఇదే విధముగా మీరు కూడా జీవితంలో అలసిపోయి నమ్మకమును కోల్పోయి మనోవేదనతో కృంగి ఉన్నారా? యేసయ్య మిమ్మును ప్రేమిస్తున్నారు మీ జీవితంలో కూడా ఒక నూతన ఆరంభమును కలుగజేయాలని ఆశపడుతున్నారా? పేతురు వలె దేవుని స్వరాన్ని విని మనలను మనం సమర్పించుకుందాం. మన జీవితం కృంగి ఉన్న అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అనుటలో సందేహమే లేదు.
- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వరాజ్ గారు
ప్రార్థన అంశం:
మన మాస పత్రికలో వాక్యమును రాస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకమైన ఆత్మతో నింపు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250