Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.02.2023
Share:

By Village Missionary Movement

Sunday, 12-Feb-2023

దిన ధ్యానము(Telugu) 12.02.2023

 

కంటత వాక్యం:

 

“నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకముగల నా బోధకు చెవియొగ్గుము” – సామెతలు 5:1

 

అంశం:- లోబడు

 

హలో చిన్న పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ గుడ్ మీరు హ్యాపీగా ఉండడానికి కారణం మీ అమ్మానాన్నే కదా! మీ తల్లిదండ్రులను యేసయ్య మీకు ఇచ్చిన గిఫ్ట్ కదా వారు చెప్పే మాటలు విని నడుచుకోవాలి అప్పుడే యేసయ్య సంతోషిస్తారు. సరే కథ వినడానికి రెడీగా ఉన్నారా? 

 

తోట, పొలము అన్నింటికీ తండ్రి అయిన ఒక యజమాని ఉండేవారు. ఈయన చాలా కష్టపడేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తోటలోనే ఉంటారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి తోటను చక్కగా చూసుకోవడం పని వారిని చక్కగా గమనించడం నేర్పించారు ఆ తండ్రి. ఒకరోజు ఆ తండ్రి అనారోగ్య పాలయ్యారు. అప్పుడు పెద్ద అన్నయ్యను పిలిచి తోటకు వెళ్లి ఈరోజు పనులన్నీ చూసుకో అని చెప్పారు. వెంటనే లేదు నాన్న నేను వెళ్ళలేను నాకు బయట చాలా పనులు ఉన్నాయి అని చెప్పాడు పెద్దన్నయ్య. సరే అని చెప్పి చిన్నన్నయ్య ఉన్నాడు కదా తనను పిలిచి తోటకు వెళ్ళమని చెప్పారు తండ్రి ఓ సరే నాన్న నేను వెళ్లి పనులన్నీ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు చిన్నన్నయ్య. చూసారా పిల్లలు చిన్నన్నయ్య తన తండ్రిని ఎలా మోసం చేశాడో. మీరు ఇలా మోసం చేయరు కదా. పెద్దన్నయ్య బైక్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు యేసయ్య తనతో వృద్ధుడైన మీ తండ్రి అనారోగ్యం పాలవడం వలనే కదా నిన్ను తోటకు వెళ్ళమన్నారు నువ్వు లోబడకుండా ఉండవచ్చా అని మాట్లాడారు. వెంటనే పెద్దన్నయ్య బైక్ ని ఆపివేసి యూటర్న్ తీసుకుని తోటకు వెళ్లి తండ్రి చెప్పిన పనులన్నింటినీ పూర్తిచేసి, పని మనుషులకు జీతం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న మీరు చెప్పిన పనిని నేను పూర్తి చేశాను అని చెప్తూ ఉన్నప్పుడు చిన్నన్నయ్య వచ్చాడు. సారీ నాన్న మీరు చెప్పిన పనులు నేను చేయకుండా మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పిన వెంటనే తండ్రి తనను క్షమించేశారు. కానీ మనసులో బాధనిపించింది. కానీ పెద్ద కుమారుడు వెళ్ళను అని చెప్పినప్పటికీ యేసయ్య మాట్లాడటం వలన లోబడ్డాడు. దానితో తండ్రి చాలా సంతోషించారు. 

 

ప్రియమైన పిల్లలు మీరు కూడా పెద్దన్నయ్య వలె తల్లిదండ్రులను సంతోషపరుస్తారా? అవును మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దవారి మూలమున యేసయ్య మంచి విషయాలను మీకు నేర్పిస్తారు. మీరు లోబడినప్పుడు ఆశీర్వదించబడిన వారై ఉంటారు గాడ్ బ్లెస్స్ యు. 

 

సిస్టర్. దేబోరా 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al