Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.02.2023
Share:

By Village Missionary Movement

Saturday, 11-Feb-2023

దిన ధ్యానము(Telugu) 10.02.2023

 

అంశం:- ఇశ్రాయేలీయులు చేయుట తప్పినవి

 

"నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని" - నిర్గమకాండము 20:2

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ఈరోజు ఇశ్రాయేలీయులు చేయుట తప్పిన రెండు కార్యాలను మనం చూద్దాం. యెహోవా ఇచ్చే మేలులను, విడుదలను పొందుకున్న ఇశ్రాయేలీయులు వాటి ప్రకారము నడుచుకోకుండా పోయిన అనేక కార్యాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అందులో ఒక సంఘటన మూలముగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక! 

 

మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద బలముగా ఉండేది. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల భూమిని పాడుచేసి పశువులను దోచుకున్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను చెర పట్టుకొనిన రోజుల్లో దేవుడు గిద్యోను అనే వ్యక్తిని లేపారు. అతడు యెహోవా పైన ఆనుకొని అతని వాక్కు ప్రకారంగా మిద్యానీయులకు విరోధముగా యుద్ధము చేయడం వలన దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనగగొట్టబడి తమ తలలను ఎత్తుకొనలేకపోయారి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరాలు నిమ్మలముగా ఉండెను. 

 

ఈ విధముగా గిద్యోను ద్వారా దేవుని నుండి మేలులను పొందుకున్న ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యమైన రెండు కార్యాల్లో తప్పిపోయారు. అందులో మొదటిది ఇశ్రాయేలు కుమారులు యెహోవాను జ్ఞాపకము చేసుకొనలేదు. ఇంకొకటి గిద్యోను చేసిన సమస్త మేలులను బట్టి తమ ఇంటి వారికి ఉపకారము చేయలేదు. బదులుగా తన కుటుంబమునకు ద్రోహం చేశారు. అవును గిద్యోను ఉపపత్ని కుమారుడైన అభిమేలేకు గిద్యోను కడుపున పుట్టిన 70 మందిని చంపుటకు ఇశ్రాయేలీయులు అభిమేలేకునకు సహాయముగా నిలబడ్డారు కానీ గిద్యోను చిన్న కుమారుడైన యోతాను మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాడు. ఇశ్రాయేలీలలో ఉన్న షేకేము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరల రప్పించెను. యెరూబయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. 

 

ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఇశ్రాయేలీయులు కృతజ్ఞత లేనివారై మేలు చేసిన వారికి విరోధముగా కీడు చేశారు. తమ దేవుడైన యెహోవాను మరిచారు. వారి అంతము శాపం అయింది. క్రైస్తవులమైన మనము మేలు చేసిన వారికి కీడు చేయక శాపమును కాక ఆశీర్వాదమును పొందుకొనుటకు అర్హులమై జీవిద్దాం. 

 

గమనిక: నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 

- బ్రదర్. కే. బెంజిమెన్ గారు. 

 

ప్రార్థన అంశం:

మన మీడియా పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al