Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.02.2023
Share:

By Village Missionary Movement

Thursday, 09-Feb-2023

దిన ధ్యానము(Telugu) 10.02.2023

 

అంశం:- ఆలస్యం చేయవద్దు

 

"తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను" - ఆదికాండము 22:3

 

చైనా దేశంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు భక్తి గల తన తల్లి ఇచ్చిన కొన్ని నాణెములు కొంచెం కొంచెంగా సేకరించాడు. ఎప్పుడైనా తనకు నచ్చిన ఒక దానిని కొనాలి అని ఆ నాణేలను దాచి పెట్టాడు. ఒకరోజు ఉదయం తన డబ్బులు డిబ్బి ని తీసుకుని పరిగెత్తుకొని తన అమ్మ దగ్గరకు వచ్చాడు. అక్కడున్న నాణేలు అన్నింటిని అమ్మ ఒడిలో వేసి నేను నిన్న రాత్రి ఒక కలను కన్నాను. అందులో మనదేశంలో గల మంచూరియా అనే రాష్ట్రంలో హంతకులు మధ్య పరిచర్య చేస్తున్న మిషనరీ గోఫోర్త్ తో నేను నిలబడి ఉన్నాను. నేను నిద్ర లేవగానే నీ డిబ్బీలో ఉన్న డబ్బులను ఆ మిషనరీ కి పంపించు అని నా లోపల చిన్న స్వరం వినిపించింది. కాబట్టి మీరు ఈ డబ్బులను ఆయనకు పంపించి యేసయ్య గురించి అక్కడున్న వారికి ప్రకటించి పరిచర్య చేయండి అని తెలపండి అని చెప్పి బయలుదేరి స్కూల్ కి వెళ్ళిపోయాడు.

 

కాసేపటి తర్వాత మరల తిరిగి పరిగెత్తుకుని వచ్చి అమ్మ ఆలస్యం చేయకుండా ఈ డిబ్బిని వెంటనే పంపించండి ప్రభువు నాతో రెండవ సారి చెప్పుటను నేను వినాలనుకోవడం లేదు అని చెప్పాడు. ఇటువంటి పిల్లల హృదయమే ఈనాడు మనకి అవసరమై ఉన్నది. దేవుడు చెప్పిన వెంటనే లోబడే విశ్వాసం అవును అబ్రహం కూడా దేవుని మాటకు లోబడ్డాడు భార్య అయిన శారాతొ ఈ విషయాన్ని పంచుకుంటే దేవుని మాట లోబడుటలో ఆలస్యము లేక ఆటంకం ఏర్పడవచ్చు అని అనుకొని ఉండవచ్చు. అందువలననే శారాకు తెలియజేయకుండా తెల్లవారినప్పుడు లేచి ఇస్సాకును బలి అర్పించుటకు దేవుడు తనతో చెప్పిన మాటకు లోబడుటకు కట్టుబడి ఉన్నాడు. ఫలితం ఏమి జరిగిందో మనకు తెలుసు ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలు బలి అయిన ఒక అద్భుత కార్యం జరిగింది.

 

ప్రియమైన వారులారా! ఆలస్యమైన విధేయత అవిధేయతతో సమానం. సాధారణంగా మనకు ఇష్టమైన పనిని చేయు లాగున ఆజ్ఞను పొందుకుంటే వెంటనే లోబడుట అనేది చాలా సులభం కానీ మనము అంగీకరించలేని, చేయుటకు ఇష్టము లేని పనిని చేయు లాగున ఆజ్ఞను పొందుకున్నప్పుడు వెంటనే లోబడటం అనేది చాలా కష్టం. కానీ అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చుటకు లోబడ్డాడు. మనము కూడా మొదట దేవునికి లోబడదాం. దేవునికి లోబడితే భర్తకు మరియు నాయకత్వానికి విధేయత చూపడం చాలా సులభం అవుతుంది. మనము చేయుటకు ఆజ్ఞను పొందుకున్న ఒక పని ఇంకొకసారి చేయమని సూచింపబడకమునుపే మనం వెంటనే లోబడడం నేర్చుకొని ఆశీర్వాదం పొందుకుందాం.

- శ్రీమతి.యబన్ సంతోష్ గారు.

 

ప్రార్థన అంశం:

ప్రతి సేవా స్థలాల్లో 30 రోజుల్లో 30 ఇళ్లల్లో ప్రార్థన కూటములు జరుగులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş