Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.02.2023
Share:

By Village Missionary Movement

Monday, 06-Feb-2023

దిన ధ్యానము(Telugu) 06.02.2023

 

అంశం:- ప్రయాస మాత్రమే కాదు

 

"శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను" - జెకర్యా 4:6 

 

డేవిడ్ అన్నయ్య యవ్వనుడైన సమూయేలుతో పరిశుద్ధ జీవితం జీవించవలసిన అవసరం గురించి విస్తారంగా మాట్లాడారు. సమూయేలు అయితే ప్రస్తుత కాల పరిస్థితుల్లో పరిశుద్ధముగా జీవించగలము అని నేను నమ్మలేదు అన్నాడు. అయినప్పటికీ నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు. వెంటనే డేవిడ్ అన్నయ్య సమూయేలు నీ ప్రయత్నం మాత్రము పరిశుద్ధ జీవితము జీవించుటకు సరిపోదు ఖచ్చితముగా ఓడిపోతావు అన్నాడు. ప్రయత్నిస్తాను అని చెబుతున్న తనకు ప్రోత్సహించే మాటలు చెప్పకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే అని సమూయేలు ఆలోచించి నిలబడ్డాడు. 

 

అయినా డేవిడ్ అన్నయ్య చెప్పినది సరైనదే. పరిశుద్ధముగా జీవించుట అన్నది ప్రయాస చేత సాధ్యం కాదు. దేవుడు నన్ను పరిశుద్ధముగా కాపాడుతారు అనే విశ్వాసముతోను మరియు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతోనే సాధ్యమవుతుంది. అవును దేవుడు మనలను పరిశుద్ధపరచ గలిగినటువంటి శక్తిమంతుడు అనే విశ్వాసం మనలను పరిశుద్ధముగా జీవించడానికి సహాయపడుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రభువు యొక్క సహాయం లేకుండా మనము ఏమి చేయలేము. మనము మన తరుపు ప్రయాస లేకుండా కూడా ప్రభువు కూడా ఏమి చేయరు. "with out God we cannot, without us He will not" , గొలియాతును దావీదు గెలిచినది ఆయన యొక్క ప్రయాసతో మాత్రమే కాదు దావీదు దేవుని మీద పెట్టుకున్న విశ్వాసం యొక్క ఫలితము. మనము కూడా గొలియాతు వంటి శోధనలు ఎదురించుటకు దేవుని మీద విశ్వాసము పెట్టుకొనిన యెడల గెలవగలం. దేవుడు మనతో ఉంటారు బలాన్ని ఇస్తారు శోధనను మనము జయించగలము. 

 

బలము చేతనైనను, శక్తి చేతనైనను కాక దేవుని ఆత్మ చేత జరుగును అని బైబిల్ చెబుతోంది. అవును మన శక్తి చేత జరగని కార్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనము చేయగలము. దేవునికి ఇష్టమైన కార్యాల్లో మనము నిమగ్నమైనప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసంలో ప్రయాస కలిసినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. యెహోషువ మరియు కాలేబు కానానులో ప్రవేశించినప్పుడు వాళ్ళిద్దరూ విశ్వాసం మీద ఆధారపడ్డారు కానీ వాళ్లతో పాటు వేగు చూడడానికి వచ్చిన పదిమంది తమ సొంత బలమును ఆధారంగా చేసుకున్నారు. కాబట్టి వారు కానాలోనికి చేరుకోలేకపోయారు. నీవు విశ్వసించిన యెడల దేవుని మహిమను చూచెదవు. 

- ఎస్. బెర్లిన్ సెల్వ భాయ్ గారు

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న పరిచర్య మరియు నిర్మాణ పనులలో దేవుడు సహాయము చేసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet