Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.02.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 05-Feb-2023

దిన ధ్యానము(Telugu) 05.02.2023 (Kids Special)

 

అంశం:- ఐడా స్కడర్

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5: 16 

 

హాయ్ పిల్లలు సంక్రాంతి సెలవులు అన్నీ కూడా సంతోషంగా గడిపారా? తను చేయగలిగిన సహాయము చేసిన ఐడా స్కడర్ గురించి ధ్యానిద్దాం. 

 

ఇంగ్లాండ్ దేశంలో ఒక హాస్టల్లో ఉండి ఐడా అనే అమ్మాయి చదువుతూ ఉంది. ఒక దినం ఆమె యొక్క ఫ్రెండ్స్ జాలీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడు మేరీ తన యొక్క ఫ్రెండ్ ఐడా తో ఐడా నీవు కూడా మీ నాన్న వలే ఇండియాకు వెళ్లి మిషనరీగా పని చేస్తావా అని అడిగింది. వెంటనే ఐడా మురికి దేశమైన ఆ ఇండియాకి వెళ్లి పనిచేయుట నాకు ఇష్టం లేదు అని చెప్పింది. వెంటనే గ్లారా అనే ఫ్రెండ్ ఐడాను నీవు కూడా మీ తండ్రి వలె డాక్టర్ గా ఇండియాకు వెళ్లి పని చేస్తే బాగుంటుంది అని చెప్పింది దానికి ఐడా నేను అలా చేయను అని చెప్పేసింది. 

 

ఐడా సెలవులకు ఇండియాకు వచ్చింది. ఒక దినము సాయంకాల సమయంలో తలుపు తట్టే శబ్దం వినబడింది వెంటనే ఐడియా పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపుతీసింది. ఒక అయ్య బయట నిలబడి ఉన్నారు. అమ్మ మీరు డాక్టర్ ఏ కదా? నా భార్య కడుపునొప్పితో బాధపడుతూ ఉంది వచ్చి వైద్యం చేయండి అని అన్నారు. వెంటనే ఐడా నేను డాక్టర్ను కాదు మా నాన్నగారే డాక్టర్ అని చెప్పింది. ఆయన వచ్చి మీకు సహాయం చేస్తారు అని చెప్పింది. అందుకు అతను లేదమ్మా మేము స్త్రీలను పురుషుల దగ్గరకు వైద్యము చేయించుకోవడానికి పంపించము అని చెప్పి వెళ్ళిపోయాడు. 

 

కొంత సమయం తరువాత మరలా తలుపు తట్టే శబ్దం వినబడింది. ఐడా తలుపు తీసి చూడగా మరొక అతను అమ్మ రండి నా భార్య చలి జ్వరముతో బాధపడుతూ ఉంది ఆమె ప్రాణానికి ప్రమాదం ఉంది వచ్చి మందులు ఇవ్వండి అని అడిగాడు. అందుకు ఐడా మునుపు చెప్పిన జవాబే డాక్టర్ నేను కాదు మా నాన్నగారే డాక్టర్ ఆయన వచ్చి వైద్యము చేస్తారు అని చెప్పింది. ఆయన కూడా స్త్రీలను వైద్యము కొరకు మగవారి దగ్గరకు పంపించము అని చెప్పి వెళ్ళిపోయాడు. మూడవదిగా ఒకాయన వచ్చి తన భార్యకు డెలివరీ చేయాలి అన్నారు ఐడా మరలా మునుపు ఇద్దరికి చెప్పిన జవాబే అతనికీ చెప్పింది ఆయన కూడా వెళ్ళిపోయాడు. 

 

ఉదయమున ఐడా కిటికీ వద్ద నిలబడి చూస్తుండగా మూడు శవాలు ఆ రోడ్డు మీద ఉన్న వెళ్తూ ఉన్నాయి. రాత్రి సహాయము కొరకు ఐడా దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు ఆ శవాలు వెనక నడుస్తూ ఉన్నారు. వెంటనే ఐడా యేసయ్య నేను డాక్టర్ చదివి ఈ ప్రజలను రక్షిస్తాను అని దేవునికి తన్ను తాను సమర్పించుకున్నది. ఐడా డాక్టర్ చదివి మన భారతదేశంలో గల తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు అనే ప్రాంతానికి వచ్చి సి.ఎం.సి అనే హాస్పిటల్ కట్టి అనేకులకు వైద్యం చేశారు. ఈ దినము కూడా అనేక రోగముల గల వారికి అక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు. 

 

ప్రియమైన పిల్లలు మీరు కూడా యేసయ్య కొరకు ఏదైనా చేస్తామని సమర్పించుకోండి. 

- సిస్టర్ బ్యులా.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet