Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.02.2023
Share:

By Village Missionary Movement

Friday, 03-Feb-2023

దిన ధ్యానము(Telugu) 04.02.2023

 

అంశం:- లెమ్ము తేజరిల్లుము

 

"నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది" - యోహాను 1:9 

 

20 సంవత్సరాలకు మునుపు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో సుమారు 6 నెలలుగా ఇంటిలోనే ఉండిపోయాను. మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తించాను. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన నా బలహీనత నుండి విడుదల పొందాను. నా గురించి అనేకులు హేళనగా మాట్లాడిన వారి మధ్యలో దేవుడు నన్ను హెచ్చించారు. నేను ఎదుర్కొన్న సవాల ద్వారా మోషేను దేవుడు ఎలా అరణ్యంలో కార్యాలు నేర్పించారో అలాగే నాకు కూడా నేర్పించారు. పరిచర్యలో దేవుడు నన్ను దీవించి ఆశ్చర్యముగా నడిపించారు. చీకటిలో ఉండే నన్ను ప్రకాశించేటట్లు చేశారు. అవును ఏ మనుష్యుని అయినను ప్రకాశింప చేయగలిగే నిజమైన వెలుగు ఆయనే. 

 

బైబిల్లో కూడా యేసు ప్రభువు కంటే ముందు వచ్చిన వ్యక్తి బాప్తిస్మము ఇచ్చు యోహాను. ఈయన జకర్యా మరియు ఎలిజిబెత్ కు పుట్టిన కుమారుడు. యోహాను గురించి ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై యుండెను అని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. అరణ్యపు జీవితం, సాధారణ వస్త్రము, సాధారణ భోజనము ఇవన్నీ కూడా ప్రజల యొద్ద నుండి అతని వేరు చేసింది. ఈయన ప్రత్యేకించబడిన జీవితము పాపాన్ని గద్దించి హెచ్చరించిన విధానము అనేక మంది ప్రజలను ప్రభువు యొద్దకు వచ్చేటట్లు బాప్తీస్మము ఇచ్చు యోహాను యొక్క బోధలు సహాయపడ్డాయి. యెరుషలేము, యూదయ మరియు యోర్ధాను చుట్టుపక్కల గల ప్రజలందరూ కూడా వారి యొక్క పాపములు ఒప్పుకొని బాప్తిస్మము పొందుకున్న విధముగా చేసింది. తన్ను తగ్గించుకొని క్రీస్తు యొక్క నామము ఘనపరచబడే విధముగా ఆయన చేసిన ప్రార్థన మనకు దీనత్వాన్ని నేర్పిస్తుంది. క్రీస్తు కొరకు ఆయన కలిగి ఉండిన ధైర్యము హతసాక్షిగా మరణించుటకు ఆయనను అర్హత కలవాడిగా చేసింది. అవును ఆయనే క్రీస్తు కొరకు ప్రకాశించుచున్న దీపమై ఉన్నారు. 

 

అవును ప్రియమైన వారలారా! మీలోనూ నేను ప్రకాశించగలనా? నా జీవితం అనేకులకు వెలుగునిచ్చే విధముగా మారగలదా? అని ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలాంటి తలంపులను బైబిల్ వాక్యముల ద్వారా సరిచేసుకోగలము. బాప్తిస్మము ఇచ్చు యోహాను యొద్ద కనబడిన తగ్గింపు అలానే క్రీస్తును గురించిన పౌరుషము మన యొద్ద కూడా కనబడిన ఎడల మనము కూడా మండుచు ప్రకాశించుచున్న వెలుగు వలె ఉంటాం. మన జీవితము అనేకులకు ఒక లైట్ హౌస్ వలే వెలుగును ఇవ్వగలదు. 

- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వరాజ్. 

 

ప్రార్థన అంశం:

ప్రతి ఇంటిలోనూ జరుగుతున్న 24 గంటల చైన్ ప్రేయర్ ద్వారా దేశంలో గొప్ప మార్పు వచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet