Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.01.2023
Share:

By Village Missionary Movement

Monday, 23-Jan-2023

దిన ధ్యానము(Telugu) 23.01.2023

 

అంశం:- నీ చేతనైనది చెయ్యు. 

 

"చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు" - ప్రసంగి 9:10

 

అట్లాంటిక్ మహాసముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్న ఒక వ్యక్తి హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. ఒకరోజు రాత్రి అతను పడుకుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి కాలుజారి సముద్రంలో పడిపోయాడు అని ఎవరో అరిచి చెప్పుట అతని చెవిలో పడింది. మొదట నేను ఏమి చేయగలను అనుకున్నాడు. కాని మరుక్షణమే దీపమును వెలిగించి గదిలో ఉన్న కిటికీకి వేలాడదీయాలి అని ఆలోచన రావడంతో అలానే చేశాడు. సముద్రంలో కొట్టుకొని పోతున్న ఆ వ్యక్తి తలపై ఆ వెలుతురు పడింది. అదే సమయంలో అతనికి సహాయము చేయుటకు వేరే బోటులో అతని కొరకు వెతుకుతున్న వారు అతని తలపై ఉన్న జుట్టును పట్టుకుని అతనిని పైకి లాగి కాపాడారు. 

 

ఈ వ్యక్తి చేసిన విధముగానే మనకు చేతనైనది ఒక చిన్న పని అయినా సరే అది దేవుని కొరకు చేసినట్లయితే నిత్యమైన మరణముకు వెళ్తున్న ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఒకరోజు పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువు మనలను చూసి బళ నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి అంటారు. 

 

నయమాను ఇంటిలో బానిసగా ఉన్న పేరు చెప్పబడని ఆ చిన్నది తనకు చేతనైనది చేసింది. తనకు తెలిసిన దానిని విశ్వాసముతో చెప్పింది. ఈ కార్యమునకు ఫలితం ఏమనగా సిరియా దేశమే రక్షింపబడింది. అవును మన యొక్క ప్రయత్నాలు స్వల్పముగా ఉండవచ్చు కాని వాటిని దేవుడు తన నామ మహిమ కొరకు ఉపయోగించుటకు శక్తిమంతుడైయున్నారు. గొప్ప కార్యాలు చేయాలి అని వేచి ఉండవద్దు. మన వెలుగు చాలా దూరం వెళ్ళాలి అని ఆశపడవద్దు. మన చేతనైన పనులను నిజాయితీగా మన చుట్టూ ఉన్నవారికి చేద్దాం అప్పుడే మనం నివసించే స్థలం అంతా ప్రకాశిస్తుంది. 

 

అవును మన జీవితం అనేది మన ప్రభువు మనకు ఇచ్చిన బహుమతి. ఈ జీవితముతో ఆయన నామ మహిమ కొరకు మనము చేసే చిన్న చిన్న సత్క్రియలు అనేవి ఆయనకు మనము ఇచ్చే కృతజ్ఞతా రుణం.

- శ్రీమతి గీత రిచర్డ్ గారు. 

 

ప్రార్థన అంశం-

నూతన సేవా స్థలాల్లో పనిచేస్తున్న సేవకులకు ఐదు ద్విచక్ర వాహనములు అవసరమైనవి వాటి కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet