By Village Missionary Movement
Wednesday, 18-Jan-2023దిన ధ్యానము(Telugu) 19.01.2023
అంశం:- చిన్న పిల్లల పరిచర్య
"ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును" - లూకా 9:48
సాయంత్రం నాలుగు గంటల తర్వాత గ్రామాలలోకి వెళ్లి చూస్తే చిన్న పిల్లలు వీధుల్లో మరియు ఆ గ్రామంలో గల పాఠశాల ముందు ఆడుకుంటూ ఉంటారు. వారి వద్దకు వెళ్లి నీకు ఒక కథ చెబుతాను అని మనము చెప్పిన వెంటనే సరే అని చెప్పి మనతో కలిసి వస్తారు ఎంతటి ఆశ్చర్యము చూడండి వీరికి కథల ద్వారా సువార్త ప్రకటించడమే చిన్నపిల్లల పరిచర్య కొన్ని సమయాల్లో వారి తల్లిదండ్రులు కూడా వారు ఏం చెప్తారు అని చెప్పి మన దగ్గరకు వస్తారు మనం నేర్పించే పాటలు వాక్యాలు కథలు మరియు మనం నేర్పించే క్రమశిక్షణను చూసి మనం వెళ్ళినప్పుడల్లా వారే తమ పిల్లలను మన దగ్గరికి పంపిస్తారు
పసి పిల్లలు అన్నం అడుగుదురు ఎవడును వారికి పెట్టరు అని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నాం. అలా అయితే అన్యజనులు పిల్లలకు యేసుక్రీస్తు ప్రభువు అవసరం. ఈ చిన్న వయసులో వారు నేర్చుకున్న పాటలే వారు పెద్దవారు అయినప్పుడు వాటిని అనుసరించి నడుచుకోనుటకు వారికి సహాయకరంగా ఉంటాయి. ఈ వయసు వారికి యేసయ్య ప్రేమను తెలియజేయకపోతే పెద్దవారైనప్పుడు నిశ్చయముగా దారి తప్పిపోవుటకు చాలా అవకాశాలు కలవు. గ్రామ మిషనరీ సంస్థ యొక్క దర్శనం నా గొర్రె పిల్లలను మేపుము అనునదే. చిన్నపిల్లల మధ్యలో ప్రాముఖ్యంగా గ్రామాలలో ఉన్న చిన్నపిల్లల మధ్యలో పరిచర్య చేసి యేసయ్య ప్రేమను వారికి తెలియజేయడం కొరకు ప్రయాస పడుతున్నాం. ఇందు కొరకు మేము ప్రత్యేకంగా నేర్చుకుని రావడం లేదు ప్రభువైన యేసుక్రీస్తు మాకు చేసిన మేలులను చిన్న కథ వలె వారికి చెబుతున్నాం. ఆ కథకు సంబంధించిన వాక్యమును వారికి తెలియజేసి యేసయ్య ప్రేమను వారికి తెలియజేస్తున్నాం.
ప్రియమైన వారలారా! నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తి ద్వారా యేసయ్య ప్రేమను మనం ఇప్పుడే వారికి ప్రకటించకపోతే భవిష్యత్తులో వారి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. ఒకవేళ ఒక బాలుడు యేసయ్య ప్రేమను ఎరిగినట్లయితే యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారతాడు. లక్షల కొలది ప్రజలను యేసయ్య వైపు తిప్పుటకు ఆ బాలుడు కారణంగా మారతాడు. భారతదేశంలో సువార్త ప్రకటించబడి 2000 సంవత్సరాలు గడిచాయి అయినను మూడు శాతం మంది ప్రజలే యేసయ్య ఎరగగలిగారు. కాబట్టి మనము కచ్చితంగా దేవుని సేవ చేయాలి. మీకు ఆశ లేక ఆసక్తి ఉన్నట్లయితే మాతోపాటు కలిసి కొంచెం సమయం లేక పూర్తి సమయము గ్రామాల్లో ఉన్న చిన్న పిల్లలను దర్శించుటకు ముందుకు వస్తారా? వచ్చి మన సంతతి వారిని చిగురింప చేస్తారా? దేశం మీ చేతిలో ఉంది కాబట్టి ఈ రోజే పనిని మొదలు పెట్టండి.
గమనిక: చిన్నవాడు చేసిన చిన్న తప్పును ప్రారంభంలోనే తుంచి వేస్తే వాడు భవిష్యత్తులో గొప్పవాడై దేశంలో అభివృద్ధి చెందుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొనండి.
- శ్రీమతి. మెర్సీ అలెగ్జాండర్
ప్రార్థన అంశం:-
తమిళనాడు అంతటిలో 3000 స్థలాలలో ట్యూషన్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం దీనిలో దేవుని హస్తం తోడైయుండు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250