By Village Missionary Movement
Tuesday, 17-Jan-2023దిన ధ్యానము(Telugu) 18.01.2023
అంశం:- కలిసి చేద్దాం.
"ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు" - కీర్తనలు 102:17
గుండె వ్యాధితో ఇంకా కొన్ని నెలల్లో మరణించే స్థితిలో ఉన్న నన్ను యేసుక్రీస్తు స్వస్థపరిచారు. యేసయ్య నన్ను స్వస్థపరిచారా అనే సందేహం నాలో కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ఏడుస్తూ పరితపించే వారి వలె తనను నాకు బయలుపరిచారు. ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్న ఆయన కన్నీటిని నేను తుడవాలి అనుకున్నాను. ప్రజలు ఆయనను నమ్మితే ఆయన కన్నీరు ఆగుతుంది అని ఆ మరుసటి వారమే సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్ళి యేసయ్య గురించి చెప్పాలి అని సైకిల్ తీసుకొని బయలుదేరాను. మొట్ట మొదట నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంధం లేదా నూతన నిబంధన, సువార్త పత్రికలు ఏమియు నా దగ్గర లేవు. చెప్పాలి అంటే జనులకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఒక గ్రామములో గల ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని బయటకు రమ్మని పిలిచి అయ్యా! అమ్మ! మీ కొరకు యేసుక్రీస్తు ఏడుస్తున్నారు ఆయనను నమ్మండి అని చెప్తూ వచ్చాను. కొంచం దూరంలో ఎక్కువ మంది కూడి ఉన్న వారి యొద్దకు వచ్చినప్పుడు వారు నన్ను పిలిచి మరణపు అంచుల్లో గల ఒక వృద్ధురాలి యొద్దకు నన్ను తీసుకొని వెళ్లారు. తమ్ముడు నువ్వు యేసయ్య వాడివి కదా నువ్వు ఈ అమ్మమ్మ కొరకు మొక్కు అన్నారు. నేను వారితో అయ్యా నాకు మొక్కడం రాదు అని చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాను. కాని అక్కడ ఉన్నవారందరు గుంపుగా వచ్చి యేసయ్య మంచి చేస్తావు అన్నారు కదా మరి ఈ వృద్ధురాలి కొరకు మొక్కు మొక్కకుండా ఇక్కడ నుండి కదలకూడదు. అని నన్ను బెదిరించారు. వేరే దారిలేక నేను కన్నీరు కార్చి యేసయ్య వీరికి ఏదో సమస్య ఉంది మీరు వీరికి ఏదైనా చెయ్యండి అని చెప్పాను. అప్పడు ఆ వృద్ధురాలి శరీరం నుండి దయ్యాలు బయటకు వచ్చేసాయి. ఆమె చనిపోతారేమో అనుకొని తప్పించుకుని పారిపోదాము అనుకున్నాను. హఠాత్తుగా ఆమె లేచి కూర్చుని మాట్లాడడం మొదలు పెట్టారు. అలానే పరిపూర్ణ స్వస్థత పొందుకున్నారు.
దీనిని చదువుతున్న మీరు ఆయన కన్నీటిని తుడుచుటకు మీ శక్తి కొలది ఏదైనా చెయ్యండి. నా శక్తి కొలది నేను చెయ్యడం ప్రారంభించాను. దేవుడు సేవ హద్దులను ఇంతగా విస్తరింపజేసీ అనేకులకు ఆశీర్వాదకరముగ నడిపిస్తున్నారు. ఆయన కొరకు మీరు చేయగలిగి నంత మీరు చేయగలిగినప్పుడు ఆయన మీ కొరకు క్రియ జరిగిస్తారు. అప్పుడు మీరు నిశ్చయముగా అద్బుతములను చేస్తారు.
- బ్రదర్. కె.డేవిడ్ గణేషన్ గారు.
ప్రార్థనా అంశం:-
ప్రార్థన గుంపులను ఐక్య పరిచి నడిపించే దెబోరా లు లేచులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250