Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.01.2023
Share:

By Village Missionary Movement

Monday, 16-Jan-2023

దిన ధ్యానము(Telugu) 17.01.2023

 

అంశం:- ఆసుపత్రి పరిచర్య.

 

"లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి" - లూకా 16:20

 

యేసుక్రీస్తు ని ఎరుగని శేఖర్ అనే ఒక యవ్వనుడు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుచు తన కుటుంబం చేత చేయి విడువబడి ఆసుపత్రిలో ఉండేవాడు. డాక్టర్ శేఖర్ యొక్క మరణ తేదీని నిర్ణయించారు. ఆ యవ్వనుడి మనస్సు పగిలి చాలా కృంగిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ పరిచర్యకు వచ్చిన కొంత మంది వ్యక్తులు శేఖర్ యొద్దకు వెళ్లి యేసు నిన్ను స్వస్థ పరుస్తారు బాధపడవద్దు అని చెప్పి విశ్వాసముతో ప్రార్థన చేసి వెళ్లిపోయారు. శేఖర్ కూడా కన్నీటితో ప్రభవుకు సమర్పించు కున్నాడు. ఆ రోజు నుండి తనలో మార్పు కలగడం ప్రారంభించింది. కొన్ని రోజుల్లోనే పరిపూర్ణ స్వస్థత పొందుకొన్నాడు. ఈ సంఘటన చూసిన డాక్టర్ మరియు చుట్టూ వున్న వారు ఆశ్చర్య పోయారు. తరువాత వివాహం చేసుకొని తన గ్రామంలో సాక్షి వలె జీవిస్తూ వస్తున్నారు. యేసుక్రీస్తు కొరకు ఆయన పూర్తి సేవ చేస్తున్నాడు. 

 

ప్రియమైన వారలారా! ఇదే విధముగా ఈరోజు అనేక మంది ప్రజలు అనేక వ్యాధులతో నన్ను విచారించుటకు, గమనించుటకు ఎవ్వరూ లేరు, నాకెందుకు ఈ ఘోరమైన వ్యాధి ఈ వ్యాధి నుండి నాకు విడుదల కలుగుతుందా, నేను ఈ వ్యాధితోనే మరణిస్తానని మరణ భయంతో బ్రతుకుతున్నారు. మరి వీరికి యేసుక్రీస్తు ప్రేమను ఎవరు ప్రకటిస్తారు. ఇటువంటి సేవను సేవకులు మాత్రమే చెయ్యగలరు అని మీరు అనుకొనవచ్చు. వారు ప్రార్థిస్తేనే అద్బుతములు జరుగుతాయి అని అనుకొనవచ్చు. కాని పరిశుద్ధ గ్రంధం మనకు స్పష్టంగా చెబుతుంది మార్కు సువార్త 16:17-18 వచనాల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడెను అని వ్రాయబడి ఉన్నవి కాని సేవకుల వలన ఈ సూచన క్రియలు కనబడును అని వ్రాయబడలేదు. అలా అయితే రక్షింపబడి యేసుక్రీస్తును విశ్వసించిన మీ ద్వారా యేసుక్రీస్తు ఇటువంటి అద్బుతములను చేస్తారు. 

 

ప్రియమైన వారలారా! ఒక రోజు యేసుక్రీస్తు మనలను చూసి అడుగుతారు. రోగినై వుంటిని మీరు నన్ను చూడ రాలేదు అని. అప్పుడు ఆయనకు ఏ జవాబు చెబుతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుంటారా? మీ ఊరికి సమీపంలో ఉన్న హాస్పిటల్స్ కు వెళ్ళి ఆయన పనిని మొదలు పెడతారా? మీరు విశ్వాసంతో చేసిన ప్రార్థన నిశ్చయముగా అద్బుతములను జరిగిస్తుంది. మీ ద్వారా శేఖర్ వంటి అనేకులు నూతన జీవితమును పొందుకొన గలరు. ఆలస్యం చెయ్య కుండా క్రియలను జరిగించండి. మీ ద్వారా అనేకులు స్వస్థత పొంది వారి ఇళ్లకు చేరనివ్వండి. 

 

గమనిక:- యేసుక్రీస్తు యొక్క గాయాల వలన మీరు స్వస్థత పొందుతారు. కాబట్టి వ్యాధి గ్రస్తుల కొరకు ప్రార్ధించాలి అని జ్ఞాపకం ఉంచు కొనండి. 

- శ్రీమతి. సారాల్ శుభాష్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు మన క్యాంపస్ లో జరుగుతూ వస్తున్న హీలింగ్ సర్వీస్ లో అనేక అద్బుత కార్యములు జరుగులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al