Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.01.2023
Share:

By Village Missionary Movement

Sunday, 15-Jan-2023

దిన ధ్యానము(Telugu) 16.01.2023

 

అంశం:- ఎవరు విరోధి?

 

"నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు" - 1 పేతురు 5:8

 

ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైనా పరిచర్య చేస్తున్నప్పుడు సమరయులు వారి యొక్క గ్రామములో ఆయనను అంగీకరించ లేదు. మేలులు చేసి వ్యాధుల నుండి స్వస్థత ఇచ్చిన యేసుక్రీస్తు ని అంగీకరించని ఆ ప్రజలను చూసి ఆయన శిష్యులైన యాకోబు మరియు యోహాను చాలా కోపపడ్డారు. ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞా పించుట నీకు ఇష్టమా అని యేసుక్రీస్తు ను అడిగారు. ఆ మాటలు విన్న యేసుక్రీస్తు వారిని గద్దించి తాను మనుష్యులను నశింపజేయుటకు కాదు రక్షించుటకు వచ్చాను అని చెప్పారు. 

 

ప్రియమైన వారలారా! సువార్తను ఆటంక పరుచువారు, సంఘమును నశింప జేయుటకు ప్రయత్నం చేయువారు పెరుగుతున్న ఈరోజుల్లో పైన చూసిన సంఘటన మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. అది ఏమనగా సువార్తను ఆటంక పరుచువారు మనకు విరోధులు కాదు. సంఘములను ఆటంకపరిచే వారు నశించిపోవాలి అని దహింపబడాలి అని మనము కోరుకొన కూడదు. బదులుగా మత్తయి సువార్త 5:44లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా వారిని ఆశీర్వదించి, ప్రేమించి, ప్రార్థన చేసి వారికి మేలు చెయ్యాలి మరియు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు భూమిపైన ఉన్న రోజుల్లో ఎవరిని విరోధముగా చూసి ద్వేశించలేదు. తనను అప్పగించిన యూదా ను చూసి ద్రోహి అని పిలవకుండా నా చెలికాడ అన్నారు. సిలువ వేసిన వారిని క్షమించమని వేడుకున్నారు. మనకు ఉన్న ఒకే ఒక విరోధి అపవాది మాత్రమే. వాడే మనుష్యులను తన ఇష్టప్రకారముగా నడిపిస్తున్నాడు. 

 

ప్రియమైన వారలారా! మనుష్యులను విరోదిగా చేసుకొని వారిపైనే ద్వేషముగ ఉన్నట్లు అయితే ఇంకా సత్యమును గ్రహించలేదు అని అర్థం. సువార్తను ఆటంక పరిచే వారి కొరకు ప్రార్దిద్దాం. యూట్యూబ్ లో క్రైస్తవులను, సేవకులను దూషించే వారిని ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. అంతే గాని వారిని తిడుతూ కామెంట్లు పెడుతూ గొడవ పడవద్దు. క్రీస్తుకు విరోధులుగా ఉన్న మనలను రక్షించిన దేవుడు వారిని కూడా రక్షిస్తారు. మనం దేవుని సేవ చేసే వారిగా ఉన్నట్లు అయితే గ్రామాల్లో ఇటువంటి వారిని చూసే విధానం, మన యొక్క దృష్టి మరియు మనస్సు మారనిద్దాం. ఆమెన్.

- జె. సంతోష్ గారు.

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో స్కూల్ కట్టవలసిన అవసరం ఉన్నది కాబట్టి సిద్దపాటు పనులలో దేవుని హస్తం తోడుండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al