Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.01.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 15-Jan-2023

దిన ధ్యానము(Telugu) 15.01.2023 (Kids Special)

 

అంశం:- సండే స్కూల్ పరిచర్య.

 

"నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును" - ప్రసంగి 11:1

 

హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు. బాగున్నారా? ఈరోజు నేను ఒక నిజ సంఘటన చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి. సరేనా! 

 

పచ్చని భూమిపై అందమైన కొండ ఆ కొండపై చిన్న చిన్న గ్రామాలు అక్కడ స్కూల్ హాస్పిటల్ ఏమి ఉండవు. బస్ వసతి కూడా ఉండదు. దేనికైనా 10 కిలోమీటర్లు కొండదిగి రావాలి. ఎంత కష్టం. పిల్లలు మనలను యేసయ్య ఎంతో ఆశీర్వదకరముగా ఉంచారు చూసారా! ఆ ఊర్లో సోము అనే చిన్న తమ్ముడు ఉండేవాడు. వాళ్ళ నాన్న కట్టెలు కొట్టడానికి వెళ్లినప్పుడల్లా సోము కూడా వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లి కట్టెలు కొట్టడంతో సహాయం చేస్తాడు. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ చేసి ఉంచిన సారయిని త్రాగుతారు. చలి కాలం వస్తే చాలు పొగ తాగుతారు. ఆ ఊర్లో అందరూ అలానే ఉంటారు. వారు చేస్తున్నది తప్పు అని అస్సలు తెలియదు. ఆ ఊరికి సువార్త ప్రకటించడానికి డేవిడ్ అనే అన్నయ్య వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు. చిన్న పిల్లలు కూడా. మద్యపానం, ధూమపానమునకు అలవాటు పడుటను, చెడు. మాటలను మాట్లాడుటను,.శుభ్రం లేకపోవడం చూసిన డేవిడ్ అన్నయ్య అక్కడ సండే స్కూల్ ప్రారంభించారు. సోము ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరిని తీసుకొని వచ్చాడు. కొన్ని నెలల్లోనే గొప్ప మార్పు కలిగింది. మద్యం సేవించండం ఆరోగ్యానికి హానికరం అని చిన్న వారు, పెద్దవారు కూడా చెప్పడం మొదలు పెట్టారు. ఈ మార్పుకు కారణం ఎవరు అని ఆ ఊరి పెద్ద అడగడంతో చాలా మంది డేవిడ్ అన్నయ్యను కొట్టడానికి వచ్చారు. అదే సమయంలో సోము వాళ్ళ నాన్నకు పాము కాటేసింది అని చెప్పి ఇంటికి మోసుకొని వచ్చారు. డేవిడ్ అన్నయ్యను కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ సోము వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. 10 కిలోమీటర్లు దూరంలో గల హాస్పిటల్ కు వెళ్లే లోపు ఈయన చనిపోతారు అని అందరు అన్నారు. సోము మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాడు. కొంచం సమయం తరువాత వాళ్ళ నాన్న లేచి కూర్చున్నాడు. చనిపోతారు అని అనుకున్న ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. సోము యొక్క ప్రార్థన వలనే ఆయనకు స్వస్థత కలిగింది అని ఆ ఊరి ప్రజలు అందరూ నమ్మారు. విశ్వాసముతో దేనిని అడిగిన యేసు క్రీస్తు ఇస్తారు అని సండే స్కూల్లో డేవిడ్ అన్నయ్య చెప్పిన మాట పిల్లల హృదయాల్లో క్రియ జరిగించడం చూసి డేవిడ్ అన్నయ్య చాలా సంతోషించారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను సండే స్కూలుకు పంపించడం మొదలుపెట్టారు. ఏంటి పిల్లలు మీరు సండే స్కూల్ కి వెళ్తున్నారా? మీ ఫ్రెండ్స్ ను కూడా తీసుకొని వెళ్ళండి. మంచి విషయాలను. నేర్పించండి. మీ జీవితమునకు యేసయ్య మార్గదర్శిగా ఉంటారు. సరేనా! సరే పిల్లలు ఈరోజు ఒక కంఠత వాక్యం కూడా నేర్చు కుందామా? 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet