By Village Missionary Movement
Friday, 13-Jan-2023దిన ధ్యానము(Telugu) 14.01.2023
అంశం:- ఒక లక్ష గ్రామాలు.
"వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా" - లూకా 8:1
1979వ సంవత్సరంలో 16 సంవత్సరాలు వయస్సు గల ఒక యువకుడు రోజుకు ఒక విత్తనం నాటడం మొదలు పెట్టాడు. ఇలా చేయడం ద్వారా సుమారు 15 ఫుట్ బాల్ గ్రౌండ్స్ అంత స్థలములో తాను ఒక్కడే విస్తారమైన తోటను అభివృద్ధి చేసాడు. ఇతడే భారతదేశపు అడవి మనిషి అని పిలవబడే జాదవ్ మొలై పాయిక్. 550 ఎకరాల బంజరు భూమిని వివిధ రకాల జంతువులు మరియు పక్షులతో సస్యశ్యామలంగా మార్చాడు. దీని అంతటికి గల కారణం కేవలం చెట్లను నాటడమే. అవును ఒక వ్యక్తి లక్షకు పైగా చెట్లు నాటి భూమికి మేలు చేయగలిగితే మన గ్రామ మిషనరీ వారికి దేవుడు ఇచ్చిన దర్శనం ఆయిన ఒక లక్ష గ్రామాలను ఇవ్వడం ఎంతటి సులభం.
భారత దేశంలో సుమారుగా ఆరు లక్షల గ్రామాలు కలవు. అందులో కోట్ల కొలది మంది ప్రజలు దేవున్ని ఎరుగక చీకట్లో ఉన్నారు. వారు యేసయ్యను ఎరుగుటకు ఒక దర్శనంతో ముందుకు సాగుతున్న మాతో మీరు ఐక్య పడవచ్చు.
మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లడి అని మార్కు సువార్త 12:2 లో వ్రాయబడి ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను మనము కూడా మన జీవితంలో అనుసరిద్దాం. శిష్యులు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను అంగీకరించి బయలుదేరి రోగులను స్వస్థ పరుచుచు గ్రామములలో సంచారము చేసిరి అని లూకా సువార్త 9:6లో మనం చదువుతున్నాం. మనము ఒంటరిగానైన లేక కుటుంబముగా నైనా చేరి గ్రామములను యేసుక్రీస్తుకు సొంతం చేయడానికి మన శక్తి కొలది పనిచేద్దాం. గ్రామాల్లో ఉన్న ప్రజలు దేవున్ని కనుగొనాలి అక్కడ ఉన్న బంధకాలు, అపవాది తంత్రాలు, రోగాల నుండి విడుదల పొందాలి. కాబట్టి మా కొరకు ప్రార్ధించండి. మనమందరము కలిసి గ్రామాలను క్రీస్తు వైపునకు నడిపిద్దాం. సువర్తకు విరోదముగా లేచు సాతాను శక్తులు ఓడిపోవాలి అని ప్రభుత్వ చట్టాలు అనుకూలంగా ఉండాలి అని దేవుని వాక్యము వెళ్ళుటకు దేవుడు ద్వారాలు తెరవాలి అని ప్రార్ధిద్దాం, విజయం సాధిద్దాం.
గమనిక: అడవిలో చెట్ల విస్తరణ పక్షులతో, దేశంలో ఆత్మల విస్తరణ మీతో అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొనండి.
- శ్రీమతి.ఐడా కింగ్ డేవిడ్.
ప్రార్థన అంశం:-
సంక్రాంతి సెలవుల్లో సేవకుల పిల్లల కొరకు జరుగుతున్న యెహోషువా లెమ్ము అనే మీటింగ్ కొరకు ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250