By Village Missionary Movement
Friday, 13-Jan-2023దిన ధ్యానము(Telugu) 13.01.2023
అంశం:- పరిశుద్ధ గ్రంధం అవసరం.
"యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును" - కీర్తనలు 19:7
మేరీ జోన్స్ 1784వ సంవత్సరం డిసెంబర్ నెలలో వేల్స్ దేశంలో జన్మించారు. ఆమె 4 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని కోల్పోయి నప్పుడు వేల్స్ దేశములో ఆర్థిక సంక్షోభం కారణంగా మేరీ జోన్స్ కుటుంబం చాలా కష్టపడింది. ఆమె తన తల్లితో కలిసి చర్చికి వెళ్లే అలవాటు ఉండడంతో 8 సంవత్సరాల వయస్సు లోనే ప్రభువు యొక్క ప్రేమతో నింపబడింది. సంఘం వారు కూడా ఆమెను ఒక సభ్యురాలిగా అంగీకరించారు. ఆ దేశంలో ఏ ఇంట్లో కూడా సొంత బైబిల్ ఉండేది కాదు. చర్చిలో ఒక బైబిల్ మరియు ఆ ఊరి నుండి రెండు మైళ్ళ దూరంలో గల ఒక ఇంట్లో ఒక బైబిల్ మాత్రమే ఉండేది. మేరీ వారానికి ఒకసారి 3 కిరలోమీటర్లు దూరం నడుచుకుంటూ ఆ ఇంటికి వెళ్లి ఆ బైబిల్ ను ఆశక్తితో చదువుతూ ఉండేది. నాకంటూ ఒక సొంత బైబిల్ ఉంటే ప్రతి రోజు చడవగలను అనుకొని తన 10 సంవత్సరాల వయస్సు నుండి తన 16 సంవత్సరాల వయస్సు వరకు అనగా 6 సంవత్సరాలు వరకు కొంచం కొంచం డబ్బులను సేకరించింది. ఒక బైబిల్ కొనడానికి సరిపడే డబ్బులు సేకరించిన వెంటనే సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. కాని బైబిల్ కొనడం చాలా కష్టముగా ఉండేది. బైబిల్ దొరకనే లేదు. 42 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓల అనే ఊర్లో థామస్ చార్లెస్ అనే ఒకాయన దగ్గర బైబిల్ ఉన్నది అని తెలుసుకొని కాలి నడకన 42 కిలోమీటర్లు వెళ్ళింది. తనకు ఒక బైబిల్ కావాలి అని అడిగింది. ఆయన తన యొద్ద ఉన్న అన్ని బైబిల్లు అమ్మివేయబడ్డాయి అని చెప్పడంతో వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. మేరీకి బైబిల్ పైన ఉన్న శ్రద్ధను చూసిన థామస్ ఇంతకు ముందే ఒకాయన డబ్బులు ఇచ్చి కొన్న బైబిల్ నా దగ్గర ఉన్నది దానిని నువ్వు తీసుకో అని చెప్పడంతో మేరీ చాలా సంతోషించింది. ఇప్పుడు నాకంటూ ఒక సొంత బైబిల్ ఇకపైన ప్రజలందరికీ. బైబిల్ గురించి నేర్పిస్తాను అనుకొంటూ వెళ్ళిపోయింది. ఈ సంఘటన థామస్ గారి హృదయంలో బైబిల్ ప్రతి ఒక్కరికి అందజేయబడాలి అనే దాహాన్ని ఏర్పరిచింది. దీని మూలముగా బైబిల్ సొసైటీ ఏర్పడింది. 1907వ సంవత్సరం లోపు ఇరవై కోట్ల నలభై లక్షల బైబిల్స్ మరియు నూతన నిబంధనలు ఈ లోకంలో అనేక చోట్లకు పంపిణీ చేయబడ్డాయి.
ప్రియమైన వారలారా! ఈనాడు మన చేతిలో ఉన్న బైబిల్ ఎంతటి అద్బుతమైనది కాని మనలో అనేక మంది బైబిల్ ను ప్రతి రోజు చదవడం లేదు. దేవుడు మనకు ఇచ్చిన బైబిల్ ను చదువుదాం, ధ్యానిద్దాం. దాని ప్రకారం నడుచుకుందాం. మనం నడిపించే పిల్లలకు మొదట నూతన నిబంధనను తరువాత పూర్తి బైబిల్ ను ఇచ్చి దానిని చదువుటకు వారిని ప్రోత్సాహిద్దాం. పరిశుద్ధ గ్రంధములు అవసరం అని మన మోక్ష ప్రయాణం పత్రికలో తెలియజేయుట ఎరిగి యుండి దేవుని పిల్లలు కొని ఇచ్చిన బైబిల్స్ ను సేవ స్థలాల్లో అందజేస్తూ ఉన్నాం. బైబిల్ ను అందుకున్న వారి జీవితం క్రీస్తులో కట్టబడులాగున ప్రార్ధించండి.
- బ్రదర్. డి. ఆల్విన్ జాకబ్ గారు.
ప్రార్థన అంశం:
24 గంటల చైన్ ప్రేయర్ ద్వారా పరిచర్యలో మరియు దేశంలో ఉజ్జీవం కలుగులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250