Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.01.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 11-Jan-2023

దిన ధ్యానము(Telugu) 12.01.2023

 

అంశం:- ప్రార్థన కూటం.

 

“ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి" - అపో.కార్యములు 12:12

 

ఒక దేవుని సేవకుడు దక్షిణ కొరియా లో గల ఒక గొప్ప సంఘంలో ప్రసంగించుటకు పిలువబడ్డాడు. వేకువజామున 5 గంటల ఆరాధనకు అతనిని తీసుకొని వెళ్ళడానికి వాహనం వచ్చింది. ఆ చలిలో పర్వతం మీద ఉన్న సంఘం లోనికి వెళ్లారు. ఈ ఆరాధనకు ఎవరు వస్తారు అనే ప్రశ్న తో లోనికి వెళ్లారు. కాని అతను అక్కడ చూసిన దృశ్యం ఏమనగా వెయ్య మందికి పైగా జనులు అక్కడ కూడి ఆరాదిస్తున్నారు. ఆశ్చర్యంతో అక్కడ ఉన్న బోధకుని అడగగా ఆ బోధకుడు మేము ప్రతి రోజు వేకువజామున 4 గంటల నుండి 5 గంటల వరకు దేశం కొరకు ప్రార్థన చేస్తాం, మరియు ఈ. సంఘంలో 100 పైగా గృహ కూడికలు కలవు అని చెప్పారు. అవును దక్షిణ కొరియా దేశంలో గొప్ప ఉజ్జీవమునకు కారణం ఈ ప్రార్థన కూటములే. 

 

పరిశుద్ధ గ్రంధంలో కూడా పేతురు చెరసాలలో బంధింప బడి ఉన్నాడు. సంఘ ప్రజలు అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఆశ్చర్య కరముగా విడిపించబడి ఇంటికి వచ్చినప్పుడు జనులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రార్థన చేశారు అని వ్రాయబడ లేదు గాని ప్రార్థన చేయుచుండిరి అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా వ్రాయించారో చూసారా? వీరు ప్రార్థన చేయడం వలన పేతురు విడిపించ బడ్డాడు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈనాడు అనేకులు సెల్ ఫోన్, వ్యసనం, మోహం వంటి చెరసాలలో బంధింపబడి వుంటున్నారు. వీరి కొరకు మనం చెయ్యవలసింది ఏమనగా? వారిని పిలిచి దండించడం చెయ్య కూడదు. వారి కొరకు ప్రార్ధించాలి. 2000 మంది 3000 మంది ప్రార్ధిస్తే దేవుడు వింటారు అంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉండెదను అని ప్రభువు చెప్పారు. మేము దర్శిస్తున్న గృహాల్లో గృహ కూడికలు జరిగిస్తున్నాం. ప్రార్థనా కూటములు జరిగే ఇళ్లల్లో ఉండే పిల్లల కొరకు మేము ప్రార్దించి నప్పుడు కొన్ని అనవసరమైన కార్యాల నుండి మరియు బాధకరమైన కార్యాల నుండి వారు విడిపించబడ్డారు. దేశంలో గొప్ప ఉజ్జీవం కలగాలి అంటే మొదట మనలో ఉజ్జీవం కలగాలి తరువాత మన కుటుంబంలో, మన సంఘంలో మండే అగ్ని గొప్ప ఉజ్జీవం కలుగజేస్తుంది. గృహ కూడికలు జరిగించుటకు దయచేసి ప్రయాస పడండి. మన గృహాల్లో గృహ కూడికలు జరిగిస్తే దేశము యెక్క ఉజ్జీవమునకు విత్తనం నాటాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. 

- శ్రీమతి. దవ మణి వైర వెల్ గారు

 

ప్రార్థన అంశం:-

7000 మిషనరీలు మరియు ఒక లక్ష గ్రామాలు అనే లక్ష్యమునకు మనం చేరుకునేలాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet