Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.01.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 10-Jan-2023

దిన ధ్యానము(Telugu) 10.01.2023

 

అంశం:- క్రీస్తు సైనికుడు.

 

"ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారుమనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి" - నెహెమ్యా 2:18

 

రోమన్ చక్రవర్తి నీరో యొక్క నిరంకుశ పాలనలో ప్రారంభ చర్చి ఉండేది. ఆ సమయంలో వేల కొలది క్రైస్తవులు హింసించ బడేవారు. కాని వారు హల్లేలూయా అనే బృంద గానంతో ప్రభువుని స్తుతిస్తూ ఉండేవారు. వారి శరీరంలో ఎన్నో గాయాలు తగులుతాయి తప్ప వారి ఆత్మ మాత్రం గాయపడలేదు. మరియు వారి ముఖాలు. ప్రకాశించుట చూసి వారి యొక్క సంతోషానికి రహస్యం ఏమిటి అని బ భయపడుతూ అడిగాడు. అందుకు వారి రాజా మేము రాజుల రాజును, దేవాది దేవుడు మరియు మా ప్రాణ ప్రియుడు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతలో ఉన్నాము అని బిగ్గరగా చెప్పారు. పరిశుద్ధ గ్రంధంలో మనం చూసినట్లయితే దానియేలు మరియు అతని స్నేహితులు రాజుల భోజనంతో తమను తాము అపవిత్రం చేసుకోకుండా ఉత్సాహంగా ముందుకు సాగారు. రాజు తనకు పెట్టిన బంగారు ప్రతిమను పూజించాలి అని ఆజ్ఞా పించినప్పుడు దానియేలు దానిని పట్టించుకోకుండా ధైర్యముగా నిలబడ్డాడు. రాజు యొక్క ఆజ్ఞలను మీరి, కిటికీలు తెరచి దేవునికి ప్రార్థన చేసాడు. దీనికి ఫలితం ఏమనగా ఆ దేశం దేవున్ని కనుగొన్నది. 

 

ప్రియమైన వారలారా! కాలం గడుస్తుంది కాని మన దేశం చీకటిలో మునిగి ఉన్నది మనం స్వార్ధ పరులుగా ఉన్నట్టు అయితే మనకు శ్రమ. నేను ఎవనిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని సెలవిచ్చిన దేవుని మాటకు చెవి యొగ్గుదాం. మీరు నివసించే గ్రామాల్లోనికి వెళ్లి మీ స్నేహితులతో కలిసి సేవ చెయ్యండి. దేవుడు అవసరతలు తీర్చి ఆయన చేసే ఆశ్చర్య కార్యములను ఓపికతో వేచి ఉండి చూడండి. సేవ అంటే ఇంతే అని ఒకవైపు, సేవ అంటే ఎంతో గొప్పది అని మరోవైపు మన సంస్థలో ప్రతి సంవత్సరం యవ్వనస్తులను ఐక్యపరచి క్రీస్తు సైనికులు అనే కూటమును జరిగిస్తూ వస్తున్నాం. మీరు కూడా క్రీస్తు సైనికులుగా లేచినట్లు అయితే కచ్చితంగా మన దేశమును మనం స్వతంత్రిచు కొనవచ్చును. 

 

గమనిక: నిరీక్షణ తో యుద్ధంలో నిలవండి అనేక మంది సైనికులకు అభివృద్ధి చేయుటకు దేవుడే మిమ్మును సాధనంగా వాడుకుంటారు అనే విషయం జ్ఞాపకం ఉంచు కొనండి. 

- శ్రీమతి. జబ ఖని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఆంద్రప్రదేశ్, ఒడిశా మరియు చత్తీస్ గడ్ లో జరుగుతున్న మన సేవా స్థలాల పరిచర్యల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet