Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.01.2023
Share:

By Village Missionary Movement

Sunday, 08-Jan-2023

దిన ధ్యానము(Telugu) 09.01.2023

 

అంశం:- యెహోషువ లెమ్ము.

 

"కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు" - మత్తయి 28:19

 

ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన హట్సన్ టైలర్ తన యవ్వన కాలంలో సువార్త పత్రిక ద్వారా యేసుని గూర్చి తెలుసుకొని రక్షింపబడ్డారు. తరువాత చైనాకు మిషనరీగా పిలుపు అందుకొని వెళ్లారు. 1853లో తన 21వ సంవత్సర వయస్సులో ఇంగ్లాండ్ నుండి చైనాలో గల షాంగై సెంటర్ ను చేరుకున్నారు. చైనాలో ఉన్న ప్రజలు రక్షింప బడాలి అనే దాహం ఆయనలో అధికంగా ఉండేది. బలహీనతతో ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు తన వైద్య విద్యను పూర్తిచేసుకుని చైనాలో గల చైనా ల్యాండ్ అనే మిషన్ సంస్థను నిర్వహించి 22 మందితో కలిసి చైనా లోనికి వెళ్లారు. అనేక పోరాటాలు ఎదుర్కోవలసి వచ్చింది. అందులో మొదటిది తన కుమార్తె మరణించింది. అదేవిధంగా తన భార్య తన ప్రసవ సమయంలో మరణించింది. ఆయనకు ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ అవి అన్నీ పరిచర్యకు ఆటంకపరచలేదు బదులుగా పరిచర్య విస్తరించ బడుటకు సహాయం చేసాయి. 1895లో 641 మంది మిషనరీలు, 462 మంది చైనా సహాయకులు ఏర్పడ్డారు. కమ్యూనిస్టు పరిపాలనలో క్రైస్తవ్యం పెరుగుతూనే వెళ్ళింది. చైనా ప్రజలు రక్షించబడి ఆ దేశములో విస్తరించ బడ్డారు. అపోస్తులుడైన పౌలు తరువాత ఎక్కువగా కాలి నడకన నడిచి సువార్తను ప్రకటించిన వారు ఈ హట్సన్ టైలర్ మాత్రమే. బిల్లీ గ్రాహం, ఎమి కార్మికేల్, ఒలింపిక్ వీరుడైన ఎరిక్ లిటిల్, 20వ శతాబ్దంలో హత సాక్షిగా మారిన జిమ్ ఎలియట్, అట్రీ, లూయి వంటి అనేకమంది ఈయన జీవితం ద్వారా తాకబడిన వారు దేవుని సేవకు తమను తాము సమర్పించు కున్నారు. పరిశుద్ధ గ్రంధంలో చూసినప్పడు మోషే నడిపించిన లక్షల కొలది ప్రజలను మోషే మరణించిన తరువాత వారిని నడిపించుటకు దేవుడు యెహోషువాను లేపారు. అదేవిధంగా ఈనాడు ఆయన సేవకు వేలకొలది మంది యెహోషువాలు అవసరం. దేశంలో ఉజ్జీవం కలగడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. మనం సేవ చేసినంత మాత్రాన ఉజ్జీవం కలుగదు. సేవ చేసే అనేకమందిని యెహోషువ వలె లేపాలి. ఇందుకొరకు మేము గ్రామ మిషనరీ సంస్థగా చేరి తరువాతి తరము యెహోషువాలను లేపుటకు ప్రయాస పడుతూ ఉన్నాం. ప్రతి నెల యవ్వనుల కొరకు మీటింగ్లు ఏర్పాటు చేసి మా శక్తి కొలది చేస్తూ వస్తున్నాం. మా కొరకు ప్రార్ధించండి. మీ పిల్లలను యెహోషువ వలె ముందుకు సాగుటకు సమర్పించండి. గమనిక మోషేతో నడచిన యెహోషువా ను యెహోవా దేవుడు వాడుకున్నారు. మీతో కలిసి నడిచేవారు యెహోషువా వలె ఉండవచ్చు వారికి మీరు మోషే వలె ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొనండి.

- బ్రదర్. పి.శివ గారు.

 

ప్రార్థన అంశం:-

నెలలో 30 రోజులు మన సేవకులు మన సేవా స్థలంలో గల 30 ఇళ్లల్లో గృహ కూడికలు క్రమముగా జరిపించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al