By Village Missionary Movement
Sunday, 08-Jan-2023దిన ధ్యానము(Telugu) 08.01.2023 (Kids Special)
అంశం:- అత్యాశ వద్దు.
"ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము" - 1 తిమోతికి 6:10
హాలో పిల్లలు ఎలా వున్నారు? అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు అందరూ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సరే పిల్లలు కధ విందామా!
రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఇంట్లో చాలా ఆవులు ఉండేవి. ప్రతి రోజు ఆ ఆవులు ఇచ్చే పాలను ఇంటింటికి అమ్మి తన కుటుంబాన్ని పోషించే వారు రాబర్ట్ అంకుల్. ఈ పాల వలన ఎక్కువ డబ్బులు రావడంతో అత్యాస చెందిన రాబర్ట్ అంకుల్ పాలల్లో నీళ్లు కలపడం మొదలు పెట్టాడు. ఇతని యొద్ద పాలు కొనేవారు ఏంటి పాలు నీళ్ళవలె ఉన్నాయి అని అడిగితే అవులకు పచ్చని గడ్డి లేకపోవడంతో అవి ఇచ్చే పాలు ఇలా పలచగా ఉన్నాయి అని తెలివిగా బదులు ఇచ్చి వెళ్లిపోయేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో ఇంకా ఎక్కువ ఆవులను కొని డైరీని స్టార్ట్ చేసి బాస్ అయిపోవాలి అని అనుకొని తాను సేకరించి ఉంచిన డబ్బులాంజ్ తీసుకొని సంతకు వెళ్లడం మొదలు పెట్టాడు. వెళ్తున్న దారిలో ఆకలి వేయడంతో ఒక చెట్టు క్రింద కూర్చొని భోజనం చేసి అలా పడుకుండి పోయాడు. దీనిని గమనించిన కోతి ఆ చెట్టు నుండి క్రిందకు దిగి అతని దగ్గర ఉన్న డబ్బుల మూటను ఆహారం అనుకొని వేగంగా వెళ్ళి ఆ మూటను తీసుకొని చెట్టు పైకి ఎక్కి ఆ మూటను విప్పింది. చూస్తే అది ఆహారం కాదు డబ్బులు కోతి మోసపోయింది. అప్పుడు రాబర్ట్ అంకుల్ లేచి డబ్బుల సంచిని వెతికాడు. కోపంగా ఉన్న కోతి ఆ డబ్బులను తన తలపై పడేసింది. ఇతను తల పైకి ఎత్తి చూస్తే ఆ సంచి కోతి చేతిలో ఉంది. రాబర్ట్ అంకుల్ ఆ డబ్బులు ఇవ్వమని ఆ కోతిని బ్రతిమలాడుకున్నారు. కాని కోతి దగ్గర ఉన్న కొలనులో కొంచం డబ్బులను, మరికొన్ని అంకుల్ వుండే స్థలములో కొంచం పడేసింది. రాబర్ట్ అంకుల్ కు బుద్ధి వచ్చింది. నీళ్లు కలిపి సంపాదించిన డబ్బులు తడిసి ముద్దగా అయ్యాయి. పాలకు రావలసిన డబ్బులు నా యొద్ద ఉన్నాయి అని ఇకపైన ఇటువంటి తప్పును ఎప్పుడు చెయ్యను అనుకొని ఇంటికి ఆ రోజు నుండి కల్తీ లేని పాలను అమ్మడం మొదలు పెట్టాడు.
ప్రియమైన తమ్ముడు చెల్లి చూసారా! అన్యాయంగా సంపాదించిన డబ్బులు అతనికి దొరకుండా పోయాయి. ఇలానే అబద్ధం చెప్పి, దొంగతనం చేసి అమ్మన్నాన లను మోసం చేసి తీసుకున్న వన్నియు మనకు మోసాన్ని కలుగ జేస్తాయి. యేసయ్య కు కూడా అలా చేస్తే నచ్చదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ పాత పాపపు స్వభావమును విడిచిపెట్టి కొత్త తీర్మానాలు తీసుకొనండి. ఓకేనా సరే కంఠత వాక్యం నేర్చు కొందమా!
- శ్రీమతి. సారల్ శుభాష్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250